ధారూరు, ఏప్రిల్ 20: పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సబితాఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదుగాలని సూచించారు.
పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన శుభ సందర్భంలో వికారాబాద్ ప్రాంత విద్యార్థులు, యువతీ యువకులు, సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనుభవజ్ఞులైన విద్యావేత్తలతో శిక్షణ ఇస్తూ, మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పిస్తున్నారన్నారు.
విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను మీ ఆశయాలుగా మార్చుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గ పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, యువతీ యువకులకు ఈ కోచింగ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, వికారాబాద్ కలెక్టర్ నిఖిల, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా గ్రాంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేశ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేందర్‌గౌడ్, ఫౌండేషన్ చైర్మన్ మెతుకు సబితాఆనంద్, ప్రజాప్రతి నిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృచేస్తానని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా డీపీఆర్సీ భవనంలో జరిగిన టీఎస్ఐజేయూ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి వెంట తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంతాస్అలీ ఉన్నారు.