ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 19 : టీఆర్ఎస్ పాలనలో వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఆస్పత్రుల ఆధునీకరణ, రోగులకు మెరుగైన వైద్యసేవల కోసం బడ్జెట్లో పదివేలకోట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖానలో మెగా హెల్త్మేళాను జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి స్వరాజ్యలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలందిస్తున్నందున ప్రతి ఒక్కరూ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ముఖ్యంగా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యమేళాను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, యాచారం ప్రభుత్వ దవాఖానలను వైద్యవిధాన పరిషత్ పరిధిలోకి తీసుకున్నారని, వైద్యవిధాన పరిషత్ ద్వారా అదనపు నిధులు రావటంతో పాటు అదనంగా సిబ్బంది, వైద్యులను కూడా ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖాన భవనాలను అత్యాధునిక హంగులతో నిర్మించటం కోసం దాతల సహకారంతో రూ.4 కోట్లతో నూతన భవనాలు నిర్మిస్తున్నామని వివరించారు. దసరా నాటికి ఈ భవనాలు పూర్తి అవుతాయని, అనంతరం ఇబ్రహీంపట్నం దవాఖానను 60 పడకట దవాఖానగా మారనుందని తెలిపారు.
అనంతరం జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి స్వరాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించాలని జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో హెల్త్‌మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, కందుకూరు, షాద్‌నగర్‌ల్లో ఈ హెల్త్మేళాను నిర్వహిస్తామన్నారు. ఈ సంజీవిని ద్వారా సబ్‌సెంటర్ల నుంచే నేరుగా డాక్టర్లతో మాట్లాడి వైద్యం పొందేందుకు వీలు కల్పించామన్నారు. హెల్త్‌క్యాంపులో పాల్గొని వైద్యపరీక్షలు చేయించుకున్న పలువురికి హెల్త్‌కార్డులను కూడా అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు.
హెల్త్ మేళాలో 706 మంది వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారు. హెల్త్క్యాంపునకు హాజరైన వారికి లయన్స్‌క్లబ్ లయన్ కేవీ రమేశ్‌రాజు ఆధ్వర్యంలో జ్యూస్‌లు, తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్‌చైర్మన్ ఆకుల యాదగిరి, డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగజ్యోతి, కౌన్సిలర్లు శ్వేత, మంగ, సుధాకర్, సుల్తాన్, జ్యోతి, మమత, శ్రీలత, ప్రసన్నలక్ష్మి, బాలరాజు, జగన్, వైద్యులు అభిరాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు వెంకట్‌రెడ్డి, వేణుగోపాల్ పాల్గొన్నారు.
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
బంట్వారం : వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మండల కేంద్రం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వ ర్యంలో నిర్వహించిన మెగా క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైద్య క్యాంపులను ఏర్పా టు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో తుకా రం, వైద్యులు హారిక, సర్పంచ్ లావణ్య పాల్గొన్నారు.