యాచారం, ఏప్రిల్ 13 : రాష్ర్టాభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 28 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరినట్లు నాయకులు, కార్యకర్తలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీని మండలంలో మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులతో రాష్ర్టానికి ఒరిగేదేమీలేదన్నారు. యాసంగి వడ్లు కొనుగోలు చేయని కేంద్రం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ రాష్ట్రమే వడ్లు కొనుగోలు చేస్తుందని ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో మరో పదేండ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉండటం ఖాయమన్నారు. బండి సంజయ్, రేవంత్‌రెడ్డి మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
ప్రభుత్వ పథకాలే టీఆర్ఎస్కు కొండంత అండగా నిలుస్తాయన్నారు. ప్రతి గడపకు ఏదో ఒకరూపంలో ప్రభుత్వ ఫలం అందుతున్నదన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్టీలో చేరినవారిలో దెంది సురేందర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, లిక్కి సుధాకర్, పర్వత్‌రెడ్డి, శ్రీశైలం, బండ బీరప్ప, కొంగల యాదగిరి, కొంగల్ల జంగయ్య, సిందం జంగయ్య, కొంగల్ల కృష్ణ, బండ మల్లేశ్, గోదాస్ రమేశ్, గోదాస్ అంజయ్య ప్రధానంగా ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చా బాషా, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు రమేశ్, కృష్ణ, సురేశ్, కిషన్, బాల్‌రాజ్, గణేశ్ ఉన్నారు.