పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 11 : రాష్ట్రంలో పండించిన ప్రతి వరిగింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కేశంపేట : ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్షకు కేశంపేట మండల ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. దీక్షలో ఎంపీపీ రవీందర్‌యాదవ్, జడ్పీటీసీ విశాల, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాంబల్‌నాయక్, శ్రావణ్రెడ్డిలతో నాయకులు పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శంకర్పల్లి : ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు బద్ధం శశిధర్‌రెడ్డి, ఎన్ బుచ్చిరెడ్డి, మండల, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షులు గోపాల్, వాసుదేవ్‌కన్నా, గౌరవ అధ్యక్షుడు జీ.గోవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీలు యాదగిరి, దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతలు ఢిల్లీ ధర్నాకు వెళ్లారు. కేంద్రం వివక్ష చూపడం సరికాదన్నారు.
ఆమనగల్లు : దీక్షకు ఆమనగల్లు బ్లాక్ మండలాల నుం చి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, బాలయ్య, జడ్పీటీసీ భరత్‌ప్రసాద్, దశరథ్‌నాయక్, సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు జోగువీరయ్య వెళ్లారు. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.