కొడంగల్/షాద్‌నగర్/కడ్తాల్/ఆమనగల్లు, ఏప్రిల్ 11 : ధాన్యం సేకరణలో కేంద్ర వైఖరి దేశానికి తెలిసేలా సీఎం కేసీఆర్ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో రైతుల పక్షాన ధర్నా చేసినట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఢిల్లీలో కేంద్రం వైఖరికి నిరసనగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒకే దేశం.. ఒకే ధాన్యం సేకరణ విధానాన్ని అనుసరించాలని, కేంద్రం మెడలు వంచి తెలంగాణలో పండిన యాసంగి వడ్లను కొనుగోలు చేసే వరకు వదిలేది లేదన్నారు.
ఢిల్లీలో కేసీఆర్ తలపెట్టిన రైతు మహా ధర్నాకు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివెళ్లారు. తెలంగాణ రైతులు పండించిన ప్రతి గింజనూ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం రైతులంతా నిరసనలు తెలుపుతున్నా చలనం లేదని, ఇప్పటికైనా కేంద్రం స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
కొడంగల్ నుంచి నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ రామకృష్ణ, 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, గిరిజన సంఘం నాయకులు దేశ్యానాయక్, సలీం పాల్గొన్నారు. షాద్‌నగర్ నుంచి జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, కేశంపేట జడ్పీటీసీ విశాల, నాయకులు దేవేందర్‌యాదవ్, సత్యనారాయణ, రాంబల్‌నాయక్, విఠల్, శివశంకర్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, మంజులారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడ్తాల్ నుంచి జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు వీరయ్య, నాయకులున్నారు.