శంకర్పల్లి, ఏప్రిల్ 10 : అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ఆయన జీవితం ఆదర్శమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని గాజులగూడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటి సమాజంలో అణచివేత, కులవివక్ష, చిన్నచూపునకు గురైన అంబేద్కర్ ప్రపంచ దేశాలకు వెళ్లి ఎవరూ సాధించలేని ఉన్నత చదువులు చదివి భారతదేశ రాజ్యాంగాన్ని రచించారన్నారు. అన్ని వర్గాల ప్రశంసలు పొందారన్నారు. ఏ వర్గమైనా అంబేద్కర్ జీవిత పాఠాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒక వర్గం, కులానికే కాదని అందరి కోసం రాజ్యాంగాన్ని రచించిన మహామేధావి అని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ చేకుర్త గోవిందమ్మ, సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, శంకర్పల్లి పీఏసీఎస్ చైర్మన్ బీ.శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చిన్న నర్సింహులు, కౌన్సిలర్ శ్రీనాథ్‌గౌడ్, సీఐ మహేశ్‌గౌడ్ పాల్గొన్నారు.