పరిగి, ఏప్రిల్ 4 : పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్‌లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన వివిధ జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలలో జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధు లలో అత్యధికంగా గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రా మాల్లో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మా ణం, డ్వాక్రా , అంగన్వాడీ భవనాల నిర్మాణాలు తదితర పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈసారి పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారికి సూచించారు. పిల్లలు ఎక్కువగా ఫెయిలవుతున్న సబ్జెక్టులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టేలా చూడాలన్నారు.
వేసవికాలంలో ఎండల తీవ్రత పెరిగిందని, గ్రామాలలోని పశు వుల నీటి తొట్టెలను రోజుకు రెండుసార్లు నీటితో నింపాలని సూచించారు. అభివృద్ధి పను ల్లో నాణ్యత పాటించకుంటే సంబంధిత ఇంజనీర్లదే బాధ్యత అని అన్నారు. పెండింగ్‌లో ఉన్న జిల్లా పరిషత్ పనులు వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. జడ్పీ నిధుల కేటాయింపుల్లో వివక్ష ఉండదని, వెనుకబడిన ప్రాంతాలకు కొంత అధికంగా నిధులు కేటాయించాల్సి వస్తుందని చెప్పా రు. దళితబంధు కింద మంజూ రైన యూనిట్లతో దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు తవ్వించాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదా యానికి గండి కొడుతున్న ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని గనుల శాఖ అధికారులను జడ్పీ చైర్పర్సన్ ఆదేశించారు. దవాఖానల్లోని అంబులెన్స్‌ల నిర్వహణకు నిధు లు మంజూరు చేయాలని వైద్యాధికారులు చైర్‌పర్సన్‌ను కోరారు.
అంతకుముందు జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ అధ్యక్షతన వ్యవసాయం పై సమీక్ష నిర్వహించారు. అంతటా భూసార పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమంపై స్థాయి సంఘా ల చైర్పర్సన్లు సుజాత, చౌహాన్ అరుణదేషు అధ్యక్షతన సమీక్షలు జరిగాయి. ఈ కార్యక్ర మం లో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డిప్యూ టీ సీఈవో సుభాషిణి, వివిధ మండలాల జడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.