పరిగి, ఏప్రిల్ 4: పరిపాలనాసౌలభ్యం కోసం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోని విభాగాలను 14 వర్టికల్‌గా విభజించడం జరిగిందని, వర్టికల్‌గా విధులను నిర్వహించడం ద్వారా పోలీసు అధికారులు, సిబ్బందిపై పనిభారం, ఒత్తిడి తగ్గుతుందని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహించేందుకు ఈ విధానం బాగా దోహదపడుతుందన్నారు. ప్రజలకు కూడా మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు. ప్రతిరోజూ ఈ విధానంలో విధులను ఆన్లైన్లో సమీక్షించుకోవాలని ఇన్చార్జి నోడల్ అధికారులకు ఎస్పీ సూచించారు. డయల్ 100కు కాల్ రాగానే బ్లూకోల్ట్స్ లేదా పెట్రోకారు సిబ్బం ది 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో చేరుకుని సమస్యలు పరిష్కరించాలన్నారు. జిల్లాలో అమలవుతున్న వర్టికల్ 14లో రిసెప్షన్, స్టేషన్ రైటర్, బ్లూకోల్ట్స్, పెట్రో ల్ కార్, కోర్టు డ్యూటీ, టెక్ టీం సైబర్ క్రైమ్, సెక్షన్ ఇన్‌చార్జ్జి, క్రైమ్ వర్టికల్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ట్రాఫిక్, ఇన్వెస్టిగేషన్, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, కమ్యూనిటీ పోలీసింగ్‌ను ఏర్పాటు చేసినట్లు, వర్టికల్ విధానంలో విధు లు నిర్వహించే సిబ్బంది, అధికారుల పనితీరు ఆధారం గా రివార్డులను అందజేస్తామన్నారు. బ్లూకోల్ట్స్ , పెట్రో కార్, కోర్టు డ్యూటీలు చేసే వారికి అధునాతన ట్యాబ్స్ ఇవ్వడం జరిగిందని, ప్రతిఒక్కరూ వాటిని వినియోగించాలని ఎస్పీ సూచించారు.