షాద్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 3 : షాద్‌నగర్ మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనులతో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 22వ వార్డు భగత్‌సింగ్‌కాలనీలో ఆదివారం అంతర్గత మురుగు కాలువ పనులను కౌన్సిలర్ సరితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాద్‌నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వార్డుల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో సీసీరోడ్లు, అంతర్గత మురుగు కాలువ, ఇంటింటి నల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను స్థానికులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, యాదగిరి, భిక్షపతి, వెంకటేశ్, నరేశ్, రమేశ్, బీరయ్య, సురేశ్ తదితలు పాల్గొన్నారు.
దాహార్తిని తీర్చడానికే చలివేంద్రాలు
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని ప్రభుత్వ దవాఖాన సమీపంలో ఆదివారం కౌన్సిలర్ బచ్చలి నర్సింహ తన తల్లి పార్వతమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, యుగేందర్, యాదగిరి, శ్రీను, శరత్ పాల్గొన్నారు.
పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా
సీఎం సహాయనిధి పేద ప్రజల ఆరోగ్యానికి కొండంత భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని ఆఫీసర్స్కాలనీకి చెందిన సూరజ్శైలేశ్ కొవిడ్‌తో కొన్ని నెలల క్రితం మృతి చెందాడు. వారి కుటుంబ సభ్యులు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ. 10 లక్షలను ఎమ్మెల్యే మంజూరు చేయించారు. ఆ చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లు చెట్ల పావని, అంతయ్య, నాయకులు నర్సింహులు, శ్రీనివాస్, యాదగిరి, రాధాకృష్ణ, శంకర్, శరత్ పాల్గొన్నారు.
శ్రీరాముడి శోభాయాత్ర వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
శ్రీరామనవమిని పురస్కరించుకొని షాద్‌నగర్ మున్సిపాలిటీలో నిర్వహించే శ్రీరాముడి శోభాయాత్ర వాల్‌పోస్టర్‌ను పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ భక్తిభావనతో ముందుకుసాగాలన్నారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్, వివిధ పార్టీల నాయకులు శ్రీవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, చెట్ల వెంకటేశ్, రఘునాథ్‌యాదవ్, ప్రదీప్, శ్రీకాంత్, నవీన్, మహేశ్, మధు పాల్గొన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కొందుర్గు : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో కోటి రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. వర్షాకాలంలో గ్రామాల్లోని కాలనీలు మురుగు నీటితో కనిపించవని అన్నారు. అనంతరం మండలంలోని గుర్రంపల్లి గ్రామంలో నిర్వహించిన బీరప్ప బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్, రాములు, కొండి యాదయ్య, రాంచంద్రయ్య, మోత్యానాయక్, రాములు, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.