నందిగామ, మార్చి 31 : అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో సర్పంచ్ గోవిందు అశోక్ ఆధ్వర్యంలో రూ.20 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో ఎస్సీ కమ్యూనిటీ భనవ నిర్మాణ పనులకు గురువారం జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ప్రియాంకతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ. 5 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తద్వారా పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతున్నదన్నారు. ముఖ్యంగా దళిత బంధు పథకం ద్వారా ఎంతో మంది దళితులు ఆర్థ్ధికంగా అభివృద్ధ్ది సాధిస్తారని, ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ విజయవంతంగా ముదుకు తీసుకెళ్తారన్న నమ్మకం ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, గోవిందు అశోక్, రమేశ్‌గౌడ్, స్వామి, ఎంపీటీసీ కళమ్మ, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, కో ఆప్షన్ సభ్యుడు బేగ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదయ్య, ఉపసర్పంచ్ కట్న శేఖర్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు జంగిలి కుమార్, సుదర్శన్‌గౌడ్, యాదగిరి, సురేందర్, కృష్ణ, వీరేందర్‌గౌడ్, నర్సింహ, బండి రాజు, శ్రీశైలం, యాదయ్య, భూపాల్, కుమార్‌గౌడ్, శ్రీకాంత్, శంకరయ్య పాల్గొన్నారు.
ఇన్ముల్‌నర్వ గ్రామంలో..
కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామం లో నిర్మిస్తున్న ఎస్టీ కమ్యూనిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణ భూమి పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ హాజరై భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోక వివక్షకు గురైందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక నిధులు, నీళ్లు, నియామకాలు తెలంగాణ ప్రాంత ప్రజల సొంతమయ్యాయని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, వైస్ ఎంపీపీ శోభ, సర్పంచ్ అజయ్‌నాయక్, ఉపసర్పంచ్ శ్రీరాములుయాదవ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణయ్యదవ్, మాజీ అధ్యక్షుడు యాదగిరి, మాజీ సర్పంచ్ మిట్టునాయక్, మాజీ ఎంపీటీసీ దేవేందర్‌యాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, లింగంనాయక్, నాయకులు రషీద్, గోపాల్‌నాయక్, సిరాజ్, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌యాదవ్ ఉన్నారు.
విద్యుత్ వైర్లను తొలగించాలని వినతి
కేవీ విద్యుత్ హైటెన్షన్ వైర్లను ఇండ్ల మధ్య నుంచి తొలగించాలని ఎమ్మెలే అంజయ్యయాదవ్‌కు కొత్తూరు టీఆర్ఎస్ నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దేవేందర్ యాదవ్ మాట్లాడుతూ 6వ వార్డులోని నారాయణగూడ కాలనీ వాసులు ఈ హైటెన్షన్ విద్యుత్ వైర్ల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా నారాయణగూడ కాలనీలో విద్యుత్ సమస్యలను విద్యుత్ ఏడీ రవీందర్, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ హైటెన్షన్ వైర్లు ఊరు మధ్యలో ఉండ టం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. అందువల్ల ఈ 33 కేవీ విద్యుత్ వైర్లను హైవే-44 పక్కనుంచి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రవీందర్, ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు కమ్మరి జనార్దనాచారి, బ్యాగరి యాదయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, గోవింద్, రవి, దాసరి నర్సింహ, శ్రీనుచారి, శ్రవణ్ పాల్గొన్నారు.