పరిగి, మార్చి 30: జిల్లాలోని చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల అంగడిచిట్టెంపల్లిలో బాలికను హత్య చేసింది ప్రియుడేనని పోలీసులు తేల్చారు. కామవాంఛ తీర్చడానికి బాలిక అంగీకరించకపోవడంతోనే హత్య చేసి నట్లు నిర్ధారించారు. బాలిక అపస్మారక స్థితిలో ఉండ గా నిందితుడు తన కామవాంఛ తీర్చుకు న్నా డు. బుధవారం పరిగి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వికా రాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఎస్పీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికకు అదే గ్రామానికి చెందిన కావలి మహేందర్ అలి యాస్ నాని(20)లకు ముందుగానే పరిచయం ఉన్న ది. వారి ఇండ్లు సైతం దగ్గరగా ఉండడం తో పాటు గత 11 నెలలుగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నది.
ఈ సం దర్భంగా ఎలాగైనా ఆమెను శారీరకంగా అను భవించాలని మహేందర్ భావించాడు. ఇదిలా వుండగా ఈనెల 25వ తేదీ శుక్రవారం వీరి ప్రేమ వ్యవహారం బాలిక చెల్లెలి ద్వారా తల్లికి తెలియడంతో ఆమె తన కూతురిని మందలించింది. తల్లి తనను మందలించిన విషయం సైతం మృతురాలు వెంటనే మహేందర్‌కు చెప్పింది. ఈ అవకాశాన్ని వాడుకోవాలని నిర్ణయించుకున్న మహేందర్ పథకం ప్రకారం ఈనెల 27వ తేదీ ఆదివారం అర్ధరాత్రి సమ యంలో కలుద్దామని ఒత్తిడి చేయగా మృతు రాలు అంగీకరించింది. దీంతో 28వ తేదీ తెల్ల వారుజామున 3.30 గంటల ప్రాంతంలో మృతురాలు, మహేందర్ కలిసి ఆమె ఇంటికి సుమారు 200 మీటర్ల దూరంలోని ప్రాంతానికి వెళ్లారు.
వారిద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత శారీరకంగా కలుద్దామని మహేందర్ ఒత్తిడి చేయగా ఆమె అంగీకరించలేదు. ఈ సందర్భంగా ఇద్దరికి తోపులాట జరిగింది. మృతు రాలు మహేందర్‌ను తోసివేయడంతో వెనకకు జరిగిన నిందితుడు అదుపు తప్పి కింద పడ బోయి ఆమెను చంపి అయినా సరే తన కోరిక తీర్చుకోవాలని భావించి ఆమె తలను వేప చెట్టు కు గట్టిగా కొట్టడంతో ఆమె నొసటికి బలంగా దెబ్బ తగిలి బాలిక స్పృహ కోల్పోయింది. ఆమె స్పృహ కోల్పోయింది సైతం గమనించకుండా ఆమెపై మహేందర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ప్రయత్నంలో ఆమె స్థితిని సైతం గమనించలేదు. బాలిక తలకు బలమైన గాయమైన స్థితి లో లైంగికదాడి జరగడం వల్ల బాలిక చనిపో యింది.
ఆమె చనిపోయినట్లు తెలిసిన వెం టనే మహేందర్ సంఘటనా స్థలం నుంచి తన స్నేహితుడు సుఖిందర్ ఇంటికి వెళ్లాడు. అనంతరం ఈ విష యం గ్రామస్తులకు తెలి సింది. ఊరిబయట దొడ్ల వద్ద బాలిక చనిపోయిందంట అని చెప్పడంతో మహేందర్, అతని స్నేహి తుడు సుఖిందర్లు సైతం సంఘటనా స్థలానికి వెళ్లి దూరం నుంచి చూశారు. అప్పటికే పలు వురు గ్రామస్తు లు అక్కడికి చేరుకున్నారు. నిం దితుడు మహేందర్‌ను బుధవారం ఉదయం తన ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలి పారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించ నున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో జిల్లా లోని సీసీఎస్, క్లూస్ టీం, ఎస్బీ తదితర విభా గాల వారందరు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఈ కేసును 48 గంటలలోనే ఛేదించామని పేర్కొంటూ వారిని ఎస్పీ అభినందించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే లా బలమైన సాక్ష్యాలు సేకరించినట్టు ఎస్పీ చెప్పారు. నేరస్తుడికి త్వరగా చట్టపరంగా కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్య లు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. కార్యక్ర మంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరామయ్య, చన్గోముల్ ఎస్ఐ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.