మండలాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం
అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 30: మండలాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఎంపీపీ రేఖామహేందర్‌గౌడ్ అధ్యక్షతన జరిగింది. దీనికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. కొన్నేండ్ల నాటి భూసమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేసినట్లు తెలిపారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న 6 ఉపకేంద్రాలకు రూ.20 లక్షల చొప్పున మంజూరు చేసినట్లు, 18 గ్రామపంచాయతీల సర్పంచ్ల కు రూ.5లక్షలు, ఎంపీటీసీలకు రూ.5లక్షల చొప్పున అభివృద్ధి పనులకోసం మంజూరు చేస్తానని ఆయన చెప్పారు. మజీద్‌పూర్ నుంచి పీర్లగూడెం వరకు రూ.కోటీ 60 లక్షలను బీటీ రోడ్డు నిర్మాణానికి మంజూరు చేసినట్లు, గుం తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు వచ్చే నెలలో శంకుస్థాపన చేసి ప్రారంభిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలో వర్షాలకు దెబ్బతిన్న కల్వర్టుల నిర్మాణానికి నిధులను కేటాయిస్తానని, అదేవిధంగా జాఫర్‌గూడ డ్వాక్రా భవన నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులపై డీఎల్పీవో తన ప్రవర్తనను మార్చుకోవాలని సూచించా రు. పంచాయతీ కార్యదర్శులపై ఫిర్యాదులొస్తున్నాయని.. వారు ప్రజలను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. సద్దుపల్లి-పిల్లాయిపల్లి బీటీ రోడ్డును మొ దటి విడుత రూ.40 లక్షలతో పూర్తి చేశామని, రెండో విడుత పనులకు మ రో రూ.40లక్షలు కేటాయించి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
అధికారులు ప్రవేశపెట్టిన నివేదికలో సమగ్ర సమాచారం లేకపోవడంతో గుంతపల్లి సర్పంచ్ వెంకటేశ్ అభ్యంతరం తెలిపారు. చిన్నరావిరాల-బండరావిరాల పరిధిలో ఏర్పా టు చేసిన క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని తదుపరి లీజులను పొడిగించొద్దని తీర్మానం చేసినట్లు సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సద్దుపల్లి-పిల్లాయిపల్లి వరకు ఉ న్న నక్షబాట కబ్జాకు గురైందని వెంటనే సర్వే చేసి బాటను గుర్తించాలన్నారు. పిగ్లీపూర్‌లోని సర్వేనం 51ని సర్వే చేసి కాపాడాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడంలేదని ఎంపీటీసీ వెంకటేశ్, మం డల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్‌పాషా ఆగ్రహం వ్యక్తం చేశా రు.
లాజిస్టిక్ పార్కులో భూములు కోల్పోయిన రైతులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కొత్తగూడెం వద్ద జాతీయ రహదారిపై డివైడర్‌ను మూసేయడంతో ఆర్టీసీ బస్సులు గ్రామంలోకి రావడంలేదని దీంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే బస్సు సౌక ర్యం కల్పించాలని సర్పంచ్ లతశ్రీగౌరీశంకర్ కోరారు. కవాడిపల్లి రాజీవ్స్వగృహలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని వైస్ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి కోరారు. త్వరలోనే రైతులతో చర్చించి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల కేంద్రంలో 24 గంటలపాటు వైద్యం అందేలా పది ఎకరాల్లో ప్రభుత్వ దవాఖానను నిర్మించాలని సర్పంచ్ కిరణ్‌కుమార్‌గౌడ్ ఎమ్మెల్యేను కోర గా .. స్పందించిన ఆయన మండల కేంద్రంలో 30 పడకల దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో మమతాబాయి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీలు బాలలింగస్వామి, రాచపాక లావణ్య, దంతూరి అనిత, చేగూరి వెంకటేశ్, వెంకటేశ్, మేడిపల్లి బాలమణి, సర్పంచ్‌లు లతశ్రీ, లావణ్య, సంతోష, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, లావణ్య, రాధ, వనజ, వెంకటేశ్, యశోద, స్వరూప, కిరణ్‌కుమార్‌గౌడ్, సుజాత, మల్లేశ్, వీరస్వామిగౌడ్, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.