కొత్తూరు, ఏప్రిల్ 16: కొత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కొత్తూరులోని పాపరస్ పోర్టులో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుతోనే కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న కొత్తూరును గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మార్చిఅన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది ముఖ్య నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారని.. దీంతో మున్సిపాలిటీలో టీఆర్ఎస్ బలం పెరిగిందన్నారు. కొత్తవారు, పాతవారు అందరూ సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. పార్టీ టికెట్ ఎవరికొచ్చినా సహకరించి గెలుపునకు కృషి చేయాలన్నారు.
టికెట్ దక్కనివారు నిరాశ చెందవద్దని.. మున్ముందు వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో మరో 15 ఏండ్లు టీఆర్ఎస్సే అధికారంలో ఉంటుందని పార్టీ కోసం పనిచేసే వారందరికీ పదవులు వరిస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగాలని సూచించారు. ఎన్నికల అనంతరం అర్హులందరికీ కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తామన్నారు. కొత్తూరు మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించడానికి స్థలం లేదన్నారు. అర్హులైనవారు తమ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందిస్తామన్నారు. కొత్తూరు, తిమ్మాపూర్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన గోవింద్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, వారి అనుచరులు సుదర్శన్‌గౌడ్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు.
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో చేరికలు..
కొత్తూరు తండాకు చెందిన 100 మంది ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజినుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తండాల్లో తమ సొంత పాలనతో సంతోషంగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో హన్మంత్‌నాయక్, చంద్రునాయక్, గోవింద్‌నాయక్, ఆంజనేయులు, బాలు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, జడ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, సుదర్శన్, ఎమ్మె సత్యనారాయణ, దేవేందర్‌యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి పాల్గొన్నారు.