పరిగి, మార్చి 29 : వికారాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు వీలుగా ఇప్పటి నుంచే గుంతలు తవ్వించే పనులు ప్రారంభించారు. జిల్లా పరిధిలోని మూడు విభాగాల్లో 32 బ్లాకుల్లో 2,81,275 మొక్కలు నాటించేందుకు పనులు కొనసాగుతున్నాయి. వీటితోపాటు తవ్వించిన కందకాల చుట్టూ సుమారు 61 కి.మీ మేరకు 1,60,000 గచ్చకాయ మొక్కలు నాటడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవేకాకుండా హరితహారంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మరో లక్ష మొక్కలు కలిపి మొత్తం 5లక్షల మొక్కల పెంపకం చేపట్టనున్నారు.
105 హెక్టార్లలో 1,16,655 మొక్కలు
జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, దున్నడం అవసరం లేని చోట్ల నేరుగా గుంతలు తవ్వించి మొక్కలు నాటడం జరుగుతుంది. జిల్లాలోని 8 బ్లాకుల్లోని 9 ప్రాంతాల్లో 1,16,655 మొక్కలు నాటనున్నారు. నస్కల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 10 హెక్టార్లలో 11110 మొక్కలు, రంగంపల్లిలో 15 హెక్టార్లలో 16655, కొత్తూరు-1లో 10 హెక్టార్లలో 11110 మొక్కలు, అల్లాపూర్‌లో 20 హెక్టార్లలో 22220 మొక్కలు, చింతకుంటలో 10 హెక్టార్లలో 11110 మొక్కలు, దామగుండంలో 10 హెక్టార్లలో 11110 మొక్కలు, దామగుండంలోని మరో ప్రాంతంలో 10 హెక్టార్లలో 11110 మొక్కలు, నాగులపల్లిలోని 10 హెక్టార్లలో 11110 మొక్కలు, గొట్లపల్లిఅంతారం ప్రాంతంలోని 10 హెక్టార్లలో 11,110 మొక్కలు నాటడం జరుగుతున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 45233 గుంతలు తవ్వే పనులు పూర్తయ్యాయి.
గ్యాప్ ప్లాంటేషన్‌లో 48000 మొక్కలు…నీలగిరి మొక్కల స్థానంలో 116620 మొక్కలు
వికారాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో మొక్కలు లేని ఖాళీ ప్రదేశాల్లో 240 హెక్టార్లలో 48000 మొక్కలు నాటడానికి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. నాగులపల్లి బ్లాక్‌లో 10 హెక్టార్లలో 2000 మొక్కలు, కల్కోడ బ్లాక్‌లోని 10 హెక్టార్లలో 2000 మొక్కలు, జిన్గుర్తి బ్లాక్‌లోని 20 హెక్టార్లలో 4000 మొక్కలు, మైల్వార్‌లో 10 హెక్టార్లలో 2000 మొక్కలు, ఇబ్రహీంపూర్‌లోని 20 హెక్టార్లలో 4000 మొక్కలు, రంగంపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో 20 హెక్టార్లలో 4000 మొక్కలు, పుర్సంపల్లి బ్లాక్‌లో 10 హెక్టార్లలో 2000 మొక్కలు, ధారూర్‌లోని 20 హెక్టార్లలో 4000 మొక్కలు, రాస్నంలోని 10 హెక్టార్లలో 2000 మొక్కలు, అదే ప్రాంతంలోని 20 హెక్టార్లలో 4000 మొక్కలు, గోకల్ఫస్లాబాద్లోని 15 హెక్టార్లలో 3000 మొక్కలు, దౌల్తాబాద్‌లోని 15 హెక్టార్లలో 3000 మొక్కలు, రేగడిమైల్వార్ ప్రాంతంలోని 10 హెక్టార్లలో 2000 మొక్కలు, మదన్‌పల్లిలోని 10 హెక్టార్లలో 2000 మొక్కలు, మోత్కుపల్లిలోని 10 హెక్టార్లలో 2000 మొక్కలు, పుల్మద్దిలోని 20 హెక్టార్లలో 4000 మొక్కలు, అనంతగిరిలోని 10 హెక్టార్లలో 2000 మొక్కలు నాటడం జరుగుతుంది.
4.41లక్షల మొక్కలే లక్ష్యం..
వికారాబాద్ జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈసారి 4.41లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఇందులో సుమారు 1037.5 ఎకరాలలో 2.81లక్షలు మొక్కలు, 61 కిలోమీటర్లు కందకాల గట్టుపై 1.60లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించి ఇప్పటివరకు 82833 గుంతల తవ్వకం చేపట్టడం జరిగింది. వేసవికాలంలో 1.60లక్షల గుంతల తవ్వకం పూర్తి చేయడం జరుగుతుంది.
– వేణుమాధవరావు, వికారాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి