నందిగామ, మార్చి 25 : రైతులు పండించిన వరిపంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు శుక్రవారం గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్‌కు వినతి
కొందుర్గు : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని వరిధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేయాలని జిల్లెడు చౌదరిగూడ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హఫీజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల మొండి వైఖరి అవలంభించడం సరికాదన్నారు. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని జిల్లెడు గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వర్రలింగం, పీఏసీఎస్ డైరెక్టర్ జబ్బార్, హన్మంత్‌రెడ్డి, రాములు, గోపాల్, గణేశ్, యాదయ్య, శేఖర్, శివరాజ్, మోత్యానాయక్, వెంకటేశ్ పాల్గొన్నారు.
ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
షాద్‌నగర్‌రూరల్: పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఫరూఖ్‌నగర్ మండలంలోని కొండన్నగూడ గ్రామస్తులు పీఎం నరేంద్రమోదీని లేఖ ద్వారా కోరారు. సర్పంచ్ శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామ సభను ఏర్పాటు చేసి తీర్మానం చేశారు.
కేశంపేట : తెలంగాణలో పండిన ప్రతి వరిగింజను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని గ్రామాల్లో రైతులు, ప్రజలు తీర్మానాలు చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ రవీందర్‌యాదవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, సర్పంచ్‌లు నవీన్‌కుమార్, వెంకట్‌రెడ్డి, కవిత, పార్వతమ్మ, రేణుక, శ్రీలత, సావిత్రి, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
దోమ : యాసంగి వరి ధాన్యం కొనాలని దోమ గ్రామ పంచాయతీలో సర్పంచ్ రాజిరెడ్డి అధ్యక్షతన గ్రామ సభ తీర్మానం చేసింది. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ లక్ష్మయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్యగౌడ్, వార్డు సభ్యులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.