రంగారెడ్డి, మార్చి 25, (నమస్తే తెలంగాణ): మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా బడుల్లో మౌలిక వసతులు కల్పించే పనులను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ శాఖ ల అధికారులతో ‘మన ఊరు-మన బడి’ పనుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడుతలో ఎంపికైన బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనపు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణం తదితర పను ల అంచనాలను సిద్ధం చేసి, పనుల అనుమతుల కోసం ఉపాధి హామీ పథకం సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అమయ్‌కుమార్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి మాట్లాడుతూ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ని సమర్థవంతంగా అమలు చేస్తామని, పనుల వివరాలను జిల్లా మంత్రితోపాటు ప్రజాప్రతినిధులకు తెలియజేస్తామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు, జిల్లా సీఈవో దిలీప్‌కుమార్, డీఆర్డీవో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
12 రకాల పనులను చేపట్టేందుకు..
ప్రభుత్వ బడుల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ‘మన ఊరు-మన బడి’ పనుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మన ఊరు-మన బడి’ లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి విడుతలో సౌకర్యాల కల్పనకు ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా వసతులను కల్పించాలన్నారు. పాఠశాలల్లో సుందరీకరణ, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పనులను చేపట్టాలని సూచించారు. సమావేశం అనంతరం వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులతో మాట్లాడుతూ మన ఊరు-మన బడి కింద జిల్లాలో మొదటి విడుతగా 371 బడులను గుర్తించినట్లు తెలిపారు. ఎంపిక చేసిన బడుల్లో 12 రకాల పనులను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఐదు రోజుల్లో గా కనీసం ఐదు పాఠశాల ల్లో పనులు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, పీఆర్ ఈ ఈ శ్రీనివాస్‌రెడ్డి, మండలాల ప్రత్యేకాధికారులు తదితరులు పాల్గొన్నారు.