ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 21 : కక్షిదారులకు సత్వర న్యాయం అందించడం కోసమే న్యాయవ్యవస్థలో అనేక మార్పులొస్తున్నాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నంలో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినందన్కుమార్సావ్లీ, జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరికృష్ణ భూపతి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కక్షిదారులకు సత్వరమే న్యాయ సేవలు అందించడం కోసం ప్రభుత్వం అవసరాన్నిబట్టి అదనపు కోర్టులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఇబ్రహీంపట్నంలో ఒకే ఒక్క మున్సిఫ్‌కోర్టు ఉండేదని, ప్రస్తుతం పెరుగుతున్న జనాభా, అధికమవుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని ఒక్క ఇబ్రహీంపట్నానికే నాలుగు నుంచి ఐదు కోర్టులు మంజూరయ్యాయన్నారు.
ఇబ్రహీంపట్నంలో ఉన్న కోర్టులన్నింటినీ ఒకేచోట ఏర్పాటు చేయడం కోసం మూడెకరాల స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. త్వరలోనే శాశ్వత భవన నిర్మాణాలకు స్థలం కేటాయించే ప్రక్రియ పూర్తవుతుందని హామీ ఇచ్చారు. వర్చువల్ విధానం ద్వారా జస్టిస్ అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఐదెకరాల స్థలం ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో హైకోర్టు రిజిస్ట్రార్ రమాకాంత్, మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి తిరుపతి, సీనియర్ సివిల్ జడ్జీలు ఇందిర, నాగరాజు, అనామిక, ఏసీపీ ఉమామహేశ్వర్రావు, ఎంపీపీ కృపేశ్, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎంపీడీవో జైరాంవిజయ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదన్న, న్యాయవాదులు సుధాకర్‌రెడ్డి, రవికిరణ్, సీహెచ్ రవి, సుగుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.