యాచారం, నవంబర్ 2: రైతుల మోటర్లకు మీటర్లు బిగించాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నడ్డి విరుస్తామని రైతు సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మం డలంలోని గున్గల్ గ్రామంలో రైతు సం ఘం జిల్లా మహాసభలను ప్రారంభించి మా ట్లాడుతూ ప్రధాని మోదీ రైతు వ్యతిరేకని, పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. రైతుల వ్యవసాయ బోరు మోటర్లకు మీటర్లు పెడితే దేశవ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించా రు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగడంతో ప్రజలు అల్లాడుతున్నారని.. దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ ఘన విజయం సాధిస్తుందన్నా రు. కార్యక్రమంలో రైతుసంఘం నాయకు లు జంగారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రామచంద్రయ్య, ఆలంపల్లి నర్సింహ, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.