ఆదిబట్ల/ఇబ్రహీంపట్నం రూరల్, అక్టోబర్ 29: రంగారెడ్డి జిల్లా ప్రజలను ఈ ఏడాది చలి ముందుగానే పలకరించింది. గడిచిన మూడు రోజులుగా శీతల గాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. దీనికి తోడు తీవ్రమైన పొగమంచు కురుస్తున్నది. ఉద యం ఏడు దాటినా చల్లి తగ్గడం లేదు. ముఖ్యం గా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు చలితో గజగజ వణుకుతున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ప్రజలు రాత్రివేళల్లో ఇండ్ల నుంచి బయటికి వెళ్లేందుకు జంకుతున్నా రు. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదు కాగా కనిష్ఠ ఉష్ణోగ్రత 13.9 డిగ్రీలకు పడిపోయింది. మంచాల, యాచారం, మాడ్గుల, తలకొండపల్లి, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉన్న ది. చలి తీవ్రత పెరుగుతుండటంతో వ్యాధులు విజృంభించే అవకాశం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ ..ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే మంచిదన్నారు.
ముందుగానే చలి..
ప్రతి ఏటా నవంబర్ నెల మధ్యలో చలి ప్రభా వం ఉండేది. కానీ ఈ ఏడాది జూన్ నుంచి ఈ నెల 20 తేదీ వరకు అక్కడక్కడ వర్షాలు కురిశా యి. దీంతో తేమ ప్రభావం కూడా అధికంగా ఉన్నది. జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో ఇప్పుడిప్పుడే వరికోతలు, పత్తితీత పనులు ప్రారంభమయ్యా యి. రాత్రి పూట పొగమంచు కురుస్తుండటంతో పత్తి నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ నెలాఖరులోనే చలి ఈ విధంగా ఉంటే రానున్న నవంబర్, డిసెంబ ర్, జనవరి నెలల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం వాకింగ్, వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
చలికాలంలో ఎండ వచ్చే వరకూ చిన్నారులు, వృద్ధులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు బయటికి రావద్దు.
శరీరానికి వెచ్చదనం ఇచ్చే దుస్తులను ధరించాలి. తలకు మప్లర్, మంకీ టోపీలను పెట్టుకోవాలి.
ఇండ్లలో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్ల వినియోగాన్ని తగ్గించాలి
ఉన్ని దుస్తులకు పెరిగిన గిరాకీ ..
చలి తీవ్రత పెరుగడంతో స్వెటర్లు, దుప్పట్లకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నమొన్నటి వరకు ఆ దుకాణాలు వెలవెలబోయాయి. ము ఖ్యంగా ఇబ్రహీంపట్నం, నాగార్జునసాగర్హైవే, యా చారం, కందుకూరు, మహేశ్వరం మండల కేం ద్రాల్లో ఏర్పాటైన స్వెటర్ల షాపులకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రతి ఏడాది చలికాలం వచ్చిందంటే ఈ ప్రాంతాల్లో షాపులను వ్యాపారులు ఏర్పాటు చేస్తుంటారు.
చర్మం జాగ్రత్త..
చలి కాలంలో చలి గాలులు, వాతావరణంలోని దుమ్ము చర్మంపై ప్రభావాన్ని చూపుతాయి. పొడిబారి చర్మంపై పగుళ్లు కనిపిస్తుంటాయి. దాహం అనిపించకపోయినా చలికాలంలోనూ ప్రతిరోజూ నాలుగునుంచి ఆరులీటర్ల వరకు నీటిని తాగాలి. గోరువెచ్చని నీటితో స్నానం చేస్తేనే మంచిది.
గ్రామీణ ప్రాంతాల్ల్లో చాలామంది చలి తీవ్రతను తట్టుకునేందుకు చలిమంటలు వేసుకుంటుంటారు. వీటి వల్ల ఒక్కోసారి మంటలకు కండ్లు తిరిగి కింద పడిపోతారు. లోబీపీకి గురవుతారు. దుప్పట్లకు మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది. చలి మంటల పొగ పీల్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది.
ఆస్తమా..
చలికాలంలో ఊపిరితిత్తుల్లో శ్వాసకోశ నాళాలు కుంచించుకుపోయి గాలి సరిగ్గా అందదు. దీం తో గాలి తీసుకోవడం, వదలడం ఇబ్బందిగా మారుతుంది. ఆయాసం, దగ్గు అధికంగా వస్తుంది. చిన్నారుల్లో జలుబు, దగ్గును అశ్రద్ధ చేస్తే న్యూమోనియా వచ్చే ప్రమాదం ఉంది. ఆస్తమా అధికశాతం వంశపారపర్యంగా సక్రమిస్తుంది. చాతీ పట్టేసినట్లు ఉండటం, ఆయా సం, దగ్గు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఈ వ్యాధి లక్షణాలు, కాలుష్యం వల్ల కూడా ఆస్త మా సంక్రమిస్తుంది. ఈ వ్యాధితో పెద్దగా ఇబ్బంది లేకపోయినా చలికాలం ముగిసేదాకా ఇబ్బందులు తప్పవు..
పొగ తాగకూడదు. తాగేవారి పక్కన ఉండకూడదు.
చలి గాలుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే ఉన్ని దుస్తులు, మంకీక్యాప్ పెట్టుకోవాలి.
దుమ్మూధూళి ప్రాంతాల్లో తిరుగకూడదు.
జలుబు, దగ్గు వచ్చిన వెంటనే వైద్యుల సూచన మేరకు మందులు తీసుకోవాలి.
ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇన్‌హెలర్‌ను దగ్గర ఉంచుకోవాలి.
తరచూ స్నానం చేయొద్దు.
చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి
చలికాలంలో ప్రతి ఒక్కరూ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమాతో బాధపడేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో జలుబు, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు అధికంగా వచ్చే అవకాశముంటుంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకాన్ని తగ్గించాలి. చలిలో ఎక్కువగా తిరగొద్దు. చర్మంపైనా అశ్రద్ధ చూపొద్దు.
-దినేశ్, వైద్యుడు
వాకింగ్‌కు వెళ్లేవారు టోపీలు ధరించాలి
ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఆస్తమాతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద యం వాకింగ్‌కు వెళ్లేవారు చెవులకు టోపీలు ధరించాలి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి.
-అభిరామ్, ప్రభుత్వ వైద్యుడు, ఎలిమినేడు