పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 28: మున్సిపాలిటీ పరిధిలో యాదవులు సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తట్టిఅన్నారంలో రాధాకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గ్రామంలో డీజే శబ్దాల మధ్య దున్నపోతులను ఊరేగించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బి.ఆంజనేయులుయాదవ్, జె.ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, జనరల్ సెక్రటరీ ఎం. కుమార్‌యాదవ్, జాయింట్ సెక్రటరీ పి. జంగయ్యయాదవ్, సభ్యులు అల్లాజీయాదవ్, జంగయ్యయాదవ్, శేఖర్‌యాదవ్, నర్సింహయాదవ్, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 28 : యాదవులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే దున్నపోతుల ఊరేగింపు (సదర్) ఉత్సవాలకు ఎంతో గొప్పచరిత్ర ఉందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్ అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో గురువారంరాత్రి నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, యాదవసంఘం నాయకులు పాల్గొన్నారు.
మొయినాబాద్, అక్టోబర్ 28 : మండల పరిధిలోని సురంగల్ గ్రామంలో ఘనంగా సదర్ ఉత్సవాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించి దున్నపోతులతో విన్యాసం చేయించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు మాట్లాడుతూ సదర్ ఉత్సవాలు యాదవులు అనాదిగా నిర్వహించుకుంటూ వస్తూ ఐక్యతను చాటుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాస్‌యాదవ్, కుమార్‌యాదవ్, జి వెంకట్‌రెడ్డి, జి.అంజిరెడ్డి, ఎన్.మహేందర్‌రెడ్డి, యాదవ సంఘం నాయకులు జ్ఞానేశ్వర్‌యాదవ్, వెంకటేష్‌యాదవ్, రాజుయాదవ్, శేఖర్‌యాదవ్, గోపాల్‌యాదవ్, రవియాదవ్ పాల్గొన్నారు.