యాలాల, అక్టోబర్ 26 : పల్లెప్రగతి కార్యక్రమంతో హాజీపూర్ దశ మారింది. రెండున్న రేళ్లలో ఊహించని అభివృద్ధి జరిగింది. అన్ని మౌలిక వసతులను గ్రామం సమకూర్చు కున్నది. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేస్తున్నారు. వైకుంఠధామం, కంపోస్టుయార్డు అందుబాటులోకి వచ్చాయి. ప్రజల ఇండ్ల నుంచి ప్రతి రోజూ తడి, పొడి చెత్తను సేకరించి పంచాయతీ ట్రాక్టర్ ద్వారా కంపోస్టుయార్డుకు తరలిస్తున్నారు. వర్మీ కంపోస్టు షెడ్డులో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. ఈ ఎరువును హరి తహారంలో భాగంగా నాటిన చెట్లకు వేయడంతో పాటు పొలాల్లో కావలసిన రైతులకు అందిసున్నారు. వంద శాతం వ్యక్తిగత మరుడుదొడ్లను నిర్మించి ఉపయోగిం చుకుం టుం డడంతో హాజీపూర్ స్వచ్ఛ గ్రామంగా మారింది. పల్లెప్రగతితో పాడుబడ్డ ఇండ్లను తొల గించడం, పాడుబడ్డ బావులను పూడ్చడంతో గ్రామం పరిశుభ్రంగా మారింది.
ప్రతి రోజూ మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు దోమల నివారణకు మురుగు నీటిని తొలగించి రసాయనాలను చల్లుతున్నారు. పల్లె ప్రకృతివనంలో వివిధ రకాల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. రోడ్లపై వ్యర్థాలు లేకుండా సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు.గ్రామంలో 1,255 మంది జనాభా ఉంది. రూ.12.60 లక్షలతో వైకుంఠధామం, రూ.మూడు లక్షలతో కంపోస్టుయార్డు, రూ.2 లక్షలతో పల్లెప్రకృతివనం పనులు చేప ట్టారు. ఈ పనులు పూర్తి కావడంతో అందుబాటులోకి వచ్చాయి. నర్సరీలో వివిధ రకాల 15 వేల మొక్కలు పెంచుతున్నారు. 20 గుంటల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో 15 రకాలకు చెందిన ఐదు వేల మొక్కలు పెంచుతున్నారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా 700 వందల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలోని కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు పలు అభివృద్ధి పనులను పూర్తి చేశారు.
అందరి సహకారంతో..
అందరి సహకారంతో గ్రామాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం. ప్రభుత్వ నిధులతో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెకు కొత్తం దం వచ్చింది. సీసీ రోడ్ల ఏర్పాటుతో గ్రామం పరిశుభ్రంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షి స్తున్నాం. అభివృద్ధి పనులను పూర్తి చేసుకోవడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటున్నాం.
–వొంగోనీబాయి శ్రీనివాస్, సర్పంచ్
భాగస్వామ్యం కావడం సంతోషం
గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసు కొంటున్నాం. సంపూర్ణ పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. హరితహారంలో భాగంగా గ్రామంలో ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాం. ఇంటింటికీ మరుగు దొడ్డి నిర్మించాం. ప్రజలకు అందించిన చెత్త బుట్టలతో ప్రతి రోజూ తడి,పొడి చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా కం పోస్టుయార్డుకు తరలిస్తున్నాం.
–దీప కులకర్ణీ పంచాయతీ కార్యదర్శి