పరిగి, మార్చి 17: మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వికారాబాద్ జిల్లాలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయాందోళన చెందుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జిల్లాలోని బషీరాబాద్, బంట్వారం, యాలాల్ మండల్లాల్లో గురువారం ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా నమోదైంది. జిల్లా సరాసరి ఉష్ణోగ్రత గురువారం 34.7 డిగ్రీలుగా ఉండగా జిల్లాలోని పలు చోట్ల మరింత అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెలాఖరు వరకు ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగొచ్చని , రెండు రోజులపాటు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా మేలో వడగాడ్పులు వీస్తాయి. కానీ ఈసారి మార్చి నెలలోనే వీస్తుండటంతో ఎండల తీవ్రత ఎంత పెరుగనున్నదో అర్థమవుతుంది. వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గురువారం జిల్లాలోని బషీరాబాద్‌లో 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత, బంట్వారంలో 40.2, యాలాల్లో 40.1, బొంరాస్‌పేట్‌లో 37.9, చౌడాపూర్‌లో 36.1, ధారూర్‌లో 37.2, దోమలో 37.4, దౌల్తాబాద్‌లో 37.3, కొడంగల్‌లో 37.4, కోట్‌పల్లిలో 37.6, కులకచర్లలో 38.4, మర్పల్లిలో 39.2, మోమిన్‌పేట్‌లో 38.7, నవాబుపేట్‌లో 36.3, పరిగిలో 36.3, పెద్దేముల్లో 37.3, పూడూరులో 36.3, తాండూరులో 37.9, వికారాబాద్‌లో 37.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజులపాటు వడగాడ్పులు ఉన్న నేపథ్యంలో ఎండల తీవ్రతతోపాటు ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నది.
పెరిగిన ఏసీలు, కూలర్ల వాడకం..
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూలర్లు, ఏసీల వాడకం పెరిగింది. తద్వారా విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. మధ్యతరగతి ప్రజలు అధికంగా కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తుండగా డబ్బు ఉన్నవారు ఏసీలను ఉపయోగిస్తున్నారు. ఉదయం 9 గంటలు దాటితే ఇం ట్లో ఫ్యాన్ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా పేదవాడి ఫ్రిజ్‌కు గిరాకీ పెరిగింది. ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు బొండాలు, శీతల పానీయాలను తాగుతున్నారు. దీంతో కొబ్బరి బొండాన్ని ఒకటి రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు.
ఎండ@38 డిగ్రీలు
రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భాను డి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. గతేడాది కంటే ఈ ఏడాది ఎండలు అధికంగా ఉండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. జిల్లా లో గురువారం గరిష్ఠంగా 38 డిగ్రీల ఉష్ణోగ్ర త నమోదైంది. ఉదయం 9 గంటల నుంచే భానుడు భగభగ మండుతుండటంతో రోడ్ల న్నీ వెలవెలబోతున్నాయి. వారం రోజుల వర కు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కగా.. మున్ముందు పరిస్థితి ఎలా ఉం టుందోనని ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే శీతల పానీయాలను తాగుతుం డగా.. ఉక్కపోత నుంచి విముక్తి పొందేందుకు కూలర్లు, ఏసీలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పగటి ఉష్టోగ్రత 38 నుంచి 40 డిగ్రీలకు వరకు ఉంటుండగా, రాత్రి ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు పైగా ఉంటున్నది. రానున్న వారం రోజుల్లో మరింత ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
ఉదయం 9 గంటలు దాటిందంటే రోడ్లపైకి జనం వచ్చేందుకే జంకుతున్నారు. పనుల నిమిత్తం బయటకువెళ్లాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళలను ఎంచుకుంటున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రత లు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఎండల తీవ్రత ఈ స్థాయిలో ఉంటే… ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందోనని భయాందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులకెళ్లే రైతులు, కూ లీలు ఎండలతో ఇబ్బందులు పడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేం దుకు ప్రజలు కొబ్బరి బొండాలు, నిమ్మకాయ, లస్సీ, పండ్ల రసాలను తాగుతున్నా రు. మరో రెండు రోజులపాటు ఎండలు అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు బయట తిరుగొద్దని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.