పరిగి, మార్చి 17 : ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించినందుకు గురువారం పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. విధుల్లో చేరిన వారు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులను ఫీల్డ్ అసిస్టెంట్లు సన్మానించి స్వీట్లు తినిపించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు మండల ఆంజనేయులు, సీనియర్ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, సర్పంచ్ జగన్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నాయకులు చంద్రశేఖర్, అంజిరెడ్డి, వెంకటయ్య, నర్సింహులుగౌడ్, స్వామి, భాను, యాదయ్య, మల్లేశం, అంజి పాల్గొన్నారు.
నవాబుపేట మండల కేంద్రంలో..
మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్ట్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీడీవో కార్యాలయం ఎదుట క్షీరాభిషేకం నిర్వహించారు. ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నవాబుపేట మండల అధ్యక్షుడు కందయ్య ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే యాదయ్య హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్ల ఇబ్బందులను గుర్తించి.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవడం గర్వంగా ఉందన్నారు. అనంతరం జిల్లాపరిషత్ పాఠశాల ఆవరణలో పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించి హెచ్ఎం పాండుతో స్కూల్‌కు సంబంధించిన విషయాలపై కాసేపు చర్చించి వసతులపై ఆరాతీశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను పరిశీలించి అక్కడ బిల్డింగ్, క్వార్టర్ల పరిశుభ్రత వంటి వాటిపై డాక్టర్ ప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచుల ఫోరం నవాబుపేట మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఎక్మామిడి సర్పంచ్ రఫీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి, యెల్లకొండ ఉపసర్పంచ్ ప్రకాశ్, ఫీల్డ్ అసిస్టెంట్లు రామచంద్రయ్య, నర్సింహులు, సాయిలు, సత్యనారాయణ పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయంలో..
ధారూరులోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మండల ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు అనంతయ్య, ప్రధాన కార్యదర్శి భిక్షపతి వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆనంద్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వారి వెంట ఫీల్డ్ అసిస్టెంట్లు గోపాల్, ఆంజనేయులు, వెంకటయ్య, అనంతయ్య, రాజు, మహేశ్, నర్సింహులు, బాబయ్య, శ్రీనివాస్, లాల్‌సింగ్, నయీం, టీఆర్ఎస్ పార్టీ ధారూరు మండల అధ్యక్షుడు రాజునాయక్, మండల అధ్యక్షుడు మాజీ వేణుగోపాల్‌రెడ్డి, మండల వ్యవసాయ కమిటీ చైర్మన్ సంతోష్‌కుమార్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి రాజుగుప్తా, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు దేవేందర్ ఉన్నారు.
విధుల్లోకి తీసుకోవడం సంతోషకరం
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం సంతోషకరమని మర్పల్లి జడ్పీటీసీ మధుకర్ హర్షం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఫీల్ట్ అసిస్టెంట్లు వెంకట్, శేఖర్, లక్ష్మయ్య, నాగేశ్ పాల్గొన్నారు.
తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో..
ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకున్నందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బాలయ్యగౌడ్ ఉన్నారు.
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.