వికారాబాద్, అక్టోబర్18 : జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశాల మేరకు వికారాబాద్ మండలం రాళ్లచిట్టంపల్లి గ్రామంలో మంగళవారం రెవెన్యూ , అటవీ శాఖ అధికారులు సంయుక్తం గా గ్రామ సభలు నిర్వహించారు. పోడు భూములపై 169 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. గ్రామస్తుల సమక్షం లో గ్రామ సభ నిర్వహించి సమస్యలను పరిష్కరి స్తామని తహసీల్దార్ షర్మిల తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ యాస్మిన్‌బేగం, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలత, ఆర్ఐ సురేశ్ పాల్గొన్నారు.
తాండూరు రూరల్: తాండూరు మండలం, మైసమ్మతండాలో మంగళవారం అధికా రులు పొడుభూముల సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఐ రాజురెడ్డి మాట్లా డు తూ మండలంలో మైసమ్మతండా, గుండ్లమడుగుతండా, జినుగుర్తితండా, చింతమణి పట్టణంలో 77 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జినుగుర్తితండా, చింత మణిపట్టణం, మైసమ్మతండాల్లో దరఖాస్తులను పరిశీలించామన్నారు. గుండ్ల మడుగు తండాలో కూడా సర్వే చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుదర్శన్‌రెడ్డి, ఫారెస్టు రెంజ్ అధికారి నాగజ్యోతి, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.
పెద్దేముల్: ఆత్కూర్ గ్రామంలో మొత్తం 101 దరఖాస్తులు గత ఏడాది జూన్‌లో స్వీక రించగా అందులో ప్రస్తుతం 10 మందికి రైతులకు సంబంధించిన భూములను అధి కారుల బృందం సర్వే పూర్తి చేసింది. నేరుగా రైతులు సాగుచేస్తున్న పొలాల వద్దకు వెళ్లి అధికారులు ప్రతి రోజు పోడు భూముల సర్వేను నిర్వహిస్తున్నారు.కార్యక్రమంలో మం డల ఎంపీడీవో లక్ష్మప్ప, ఆర్ఐ రాజు రెడ్డి, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.
పూడూరు: పూడూరు మండలం సోమన్గుర్తి, దేవనోనిగూడెం గ్రామాల్లో పోడు భూము లపై వచ్చిన దరఖాస్తులను గ్రామ సభ ద్వారా తహసీల్దార్ మోహన్ పరి శీలించారు. రెండు గ్రామాల నుంచి సుమారుగా 150 మంది దరఖాస్తు చేసుకోగా 40 మంది రైతుల పేర్లు లిస్టులో వచ్చినట్లు తెలిపారు. గ్రామ సభ అనంతరం రైతుల పొలాల ను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సంధ్యాభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.