జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్
జిల్లా వ్యాప్తంగా 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కరోనా టీకా
టీకా కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు
కొత్తూరు రూరల్, మార్చి 16 : కొవిడ్ టీకాలను ప్రతి ఒక్కరూ వేసుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కవిత ఆధ్వర్యంలో 12 నుంచి 14 ఏండ్ల పిల్లలకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ ప్రియాంకగౌడ్, సర్పంచ్ వెంకట్‌రెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం వైద్య సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మెక్కొండ కుమార్‌గౌడ్, ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ సహకరించాలి
అబ్దుల్లాపూర్‌మెట్ : కరోనాను నివారించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎపీపీ బుర్ర రేఖ, జడ్పీటీసీ బింగి దాస్‌గౌడ్ అన్నారు. సర్పంచ్ చెరుకు కిరణ్‌కుమార్, ఎంపీటీసీ సౌమ్య, మెడికల్ ఆఫీసర్ శ్వేతతో కలిసి పిల్లలకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలి
యాచారం : 12 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా కొవిడ్-19 వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ముఖ్యంగా చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, మండల వైద్యాధికారి ఉమాదేవి, హెచ్‌ఈవో శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యం పట్ల..
మొయినాబాద్:విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. 12-14 ఏండ్ల వయస్సు గల వారికి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాజు, డైరెక్టర్ ఆంజనేయులుగౌడ్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నర్సింగ్‌రావు, డాక్టర్ శిరీష, హెల్త్ సూపర్వైజర్ సునీత, ఎంపీటీసీ మల్లేశ్, కో ఆప్షన్ సభ్యుడు బిలాల్, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్ పాల్గొన్నారు.
చిన్నపిల్లలకు టీకాలు వేయించండి
కేశంపేట : మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిల్లలకు కొవిడ్ టీకా కార్యక్రమాన్ని ఎంపీపీ రవీందర్‌యాదవ్ ప్రారంభించారు. అనంతరం గ్రామాల్లో కరోనా సమయంలో ప్రజలకు సేవలందించిన ఏఎన్ఎం, ఆశవర్కర్లను ఎంపీపీ సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ సుమంత్‌కుమార్, సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్, నాయకులు మురళీధర్‌రెడ్డి, పర్వత్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
కొవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ తప్పనిసరి
ఇబ్రహీంపట్నం : కరోనా మహమ్మారిని పూర్తిగా నివారించడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీపీ కృపేశ్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, వైద్యాధికారి అభిరాం తదితరులు పాల్గొన్నారు.