కడ్తాల్, ఆగస్టు 19 : క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్ అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న, ఫ్రీడం కప్ జిల్లాస్థాయి పోటీలకు కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల్ మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులు ఎంపికయ్యారు.
శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో… వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, రన్నింగ్, లాంగ్‌జంప్ పోటీల్లో పాల్గొంటున్న ఆయా మండలాల విద్యార్థులకు కేఎన్ఆర్ యువసేన జిల్లా అధ్యక్షుడు నరేశ్‌నాయక్ టీఆర్ఎస్ నాయకులతో కలిసి క్రీడా దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జహంగీర్‌అలీ, యాదగిరిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, యాదయ్య, హెచ్ఎంలు జంగయ్య, విజయ, పీఈటీలు భీముడు, చంద్రమోహన్, విద్యార్థులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌రూరల్, ఆగస్టు 19 : ఫరూఖ్‌నగర్ మండలంలోని కమ్మదనం గురుకుల పాఠశాలలో వజ్రోత్సవాల సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు ముగ్గులు, పరుగు పందెం పోటీలను నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యులత తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెం పోటీల్లో గురుకుల పాఠశాలకు చెందిన కీర్తన ప్రథమ బహుమతి సాధించారు.
నందిగామ, ఆగస్టు19 : నందిగామ ప్రభుత్వ దవాఖానలో సర్పంచ్ జిల్లెల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, గ్రామస్తులకు మొక్కల పంపిణీ చేశారు. కార్యక్రమంలో నందిగామ సీఐ రామయ్య, ఎంపీడీవో బాల్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, మండల వైద్యాధికారి కవిత పాల్గొన్నారు.
యాచారం, ఆగస్టు19 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో బాలింతలకు కేసీఆర్ కిట్లు, రోగులకు పండ్లు, బ్రెడ్లను ఎంపీపీ కొప్పు సుకన్య, సీఐ లింగయ్య, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి శుక్రవారం పంపిణీ చేశారు. వారి వెంట మెడికల్ ఆఫీసర్ ఉమాదేవి, హెచ్‌ఈవో శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 19 : స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించారు. శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాయింగ్, చెస్, క్యారమ్స్, వకృత్వ, వ్యాసరచన వంటి క్రీడలను నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆటలపోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానోపాధ్యాయులు సురేశ్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు.
స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఇబ్రహీంపట్నం సమీపంలోని అంధుల ఆశ్రమం, మాతాపితరుల సేవాసదనంలో ఇబ్రహీంపట్నం ఎంపీడీవో జైరాం విజయ్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో లక్పతినాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
షాద్‌నగర్, షాద్‌నగర్‌టౌన్, ఆగస్టు19: మున్సిపల్ చైర్మన్ నరేందర్ ఆధ్వర్యంలో షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానతో పాటు వృద్ధాశ్రమంలో పాలు, బ్రెడ్, పండ్లను సీఐ నవీన్‌కుమార్, కౌన్సిలర్లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర వజ్రోత్సవాలతో ప్రతి ఒక్కరిలో దేశభక్తి నెలకొందన్నారు. కార్యక్రమంలో కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు నర్సింహ, వెంకట్రాంరెడ్డి, ఈశ్వర్‌రాజు, శ్రీనివాస్, కొత్తూరు మున్సిపల్ చైర్మన్ లావణ్య దేవేందర్‌యాదవ్, నాయకులు శేఖర్, యాదగిరి, డాక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట, ఆగస్టు 19 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మున్సిపాలిటీలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పసుమాములలోని అంజనీ దేవి చారిటబుల్ ట్రస్ట్ అనాథాశ్రమంలో పిల్లలు, వృద్ధులకు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవి, కమిషనర్ రామాంజులరెడ్డి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, అనురాధ సురేశ్ పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కె.విజయ్‌మోహన్, మున్సిపల్ మేనేజర్ కిరణ్, ట్రస్ట్ ఇన్చార్జి సీహెచ్ ఉపేందర్, అంగన్వాడీ టీచర్ రాణి పాల్గొన్నారు.
తట్టిఅన్నారంలోని స్పందన బాలికల వసతిగృహంలో మహిళా శిశు సంక్షేమశాఖ, జిల్లా బాలల రక్షణ విభాగం వారి సహకారంతో కౌన్సిలర్ మద్ది శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్పందన హెచ్ఆర్ ఉత్తమకుమార్, హోం ఇన్చార్జి సబిత పాల్గొన్నారు.
మంచాల, ఆగస్టు 19: స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం మంచాల మండలం ఆరుట్ల, మంచాల ప్రభుత్వ పాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఎంపీపీ నర్మద ముఖ్య అతిథిగా హాజరై రోగులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అనితతో పాటు సిబ్బంది, వైద్యాధికారులు పాల్గొన్నారు.