చేర్యాల, జూలై 2 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొమురవెల్లి మల్లన్న ఆలయ దిశ, దశ మారిపోతున్నది. క్షేత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కృషితో భక్తులకు అభివృద్ధి ఫలాలతో పాటు వసతులు సమకూరుతున్నాయి.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారికి భక్తులు మొ క్కుల రూపంలో చెల్లించుకునే తలనీలాల సేకరణ హక్కుల కోసం ఇటీవల మల్లన్న ఆలయంలో నిర్వహించిన సీల్డ్ టెం డర్ కం బహిరంగ వేలం పాటలో స్వామి ఆదాయం భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వామి వారి ఖజానాకు లక్షల్లో ఆదాయం సమకూరడంతో ఆలయ అధికారు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం పాటలో ఆలయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 14మంది వ్యాపారులు తలనీలాల సేకరణ హక్కులు దక్కించుకునేందుకు పోటాపోటీగా పాటను పాడి రూ.84.47 లక్షలకు కొమురవెల్లికి చెందిన రుద్ర ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం హక్కులను దక్కించుకుంది. వేలం పాటల్లో హక్కు లు దక్కించుకున్న వారికి ఏడాది పాటు స్వామివారికి భక్తు లు సమర్పించుకునే తలనీలాల సేకరించేందుకు టెండర్ దారులకు ఆలయవర్గాలు హక్కులను కల్పిస్తారు.
కొమురవెల్లి మల్లన్న వారి తలనీలాల సేకరణకు ఇటీవల ఆలయంలో వేలం నిర్వహించగా, రూ.84.47లక్షల ఆదా యం వచ్చింది. 2017లో రూ.38.56లక్షలు, 2018లో 41.61లక్షలు, 2019లో రూ.38,51,516, 2020 కరోనా కాలంలో సైతం రూ.45,51,116, 2022లో రూ.48.02లక్షలు, ఈ నెల 10వ తేదీ నుంచి 2023 జూలై 9వ తేదీ వరకు నిర్వహించిన టెండర్లలో రూ.84.47లక్షల ఆదాయం వచ్చింది.
అలాగే కొబ్బరికాయల విక్రయ హక్కులను రూ. 32.25లక్షలు, ఎల్లమ్మ ఆలయం వద్ద కొబ్బరికాయలు, పూజాసామగ్రి విక్రయ హక్కులను రూ.8.53లక్షలు, ఒడిబియ్యం సేకరణకు రూ.13.30లక్షలు, పాదరక్షలు భద్రపర్చుకునే హక్కులకు రూ.5.35లక్షలకు పాడి పలువురు హ క్కులను దక్కించుకున్నారు. తలనీలాల టెండర్ కాకుండా వివిధ టెండర్లకు సైతం ఎక్కువ ఆదాయం వచ్చింది.