రంగు రంగుల ముగ్గులతో ధరణి పులకించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీ పడి రంగవల్లులు వేసి దేశభక్తిని చాటారు. పలుచోట్ల మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఉత్సాహపరిచారు. స్వాతంత్య్ర గొప్పతనం, జాతి సమైక్యతను తెలిపే ముగ్గులు చూపరులను అలరించాయి. అనంతరం విజేతలను ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేశారు.
షాద్‌నగర్, ఆగస్టు 20: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీలోని వినాయకగంజ్ ఆవరణలో శనివారం నిర్వహించిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. దేశభక్తిని తలపించేలా మహిళలు ముగ్గులను వేశారు. జాతీయ పతాకం, జై జవాన్, జై కిసాన్ అనే విధంగా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీలను మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం సురేఖ, సీడీపీవో నాగమణి, కౌన్సిలర్లు పరిశీలించారు.
ప్రతిభ కనబర్చిన మహిళలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేశంపేట, కొత్తూరు, నందిగామ మండలాల్లో రంగవల్లుల పోటీలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో మండలాల అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంరూరల్ : మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మహిళలకు రంగోలి పోటీలు నిర్వహించారు. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేశారు. ఎంపీపీ కృపేశ్ ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జైరాం విజయ్, ఎంపీవో లక్పతినాయక్, ఏపీఎం రవీందర్, ఏఈ ఇంద్రసేనారెడ్డి, సూపరింటెండెంట్ క్రాంతికిరణ్ పాల్గొన్నారు.
తలకొండపల్లి : మండలంలోని వెల్జాల్ గ్రామం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో మహిళలకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అలవర్చుకునేలా మహిళలు ముగ్గులతో ప్రదర్శించారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యులు రహమాన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, పంచాయతీ కార్యదర్శి శరత్, వార్డు సభ్యులు విజయ్‌కుమార్, శ్రీను, నాయకులు దస్తగిరి, రాజు, శేఖర్, సుధాకర్, బాలరాజు, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.
పెద్దఅంబర్‌పేట: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు మైత్రి కుటీర్ కాలనీలో రంగోలి కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ముగ్గులతో జాతీయ సమైక్యత, సాతంత్య్రం గొప్పతనాన్ని చాటారు. కార్యక్రమంలో కమిషనర్ రామాంజులరెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్ సిద్దెంకి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు పాశం అర్చన, కందాడ అనుపమ, మున్సిపల్ మేనేజర్ కిరణ్, ఏఈ వీరాంజనేయులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిబట్ల : ఆదిబట్ల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కొంగరకలాన్, మంగల్‌పల్లి, ఎంపీ పటేల్‌గూడ, బొంగ్లూరు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులను అందచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి, కౌన్సిలర్ నల్లవోలు లావణ్య, మున్సిపల్ సిబ్బంది కొంగరకలాన్‌లో కౌన్సిలర్ వనం శ్రీనివాస్, నాయకలు కాకి రవీందర్, నర్సగళ్ల ప్రవీణ్ పాల్గొన్నారు.
శంకర్పల్లి : వజ్రోత్సవాలలో భాగంగా మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు శ్వేత, సంధ్యారాణి, సీహెచ్ అశోక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
యాచారం : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ముగ్గుల పోటీ నిర్వహించారు. మహిళలు దేశభక్తి ఉట్టి పడేలా అనేక రంగురంగులతో రకరకాల ముగ్గులను వేశారు. విజేతలకు ఎంపీపీ సుకన్య బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంపీవో ఉమారాణి, ఏపీఎం సతీశ్, సూపరింటెండెంట్ శైలజ, సీసీ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
కడ్తాల్ : ఎంపీడీవో కార్యాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు. ఎంపీడీవో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నందిగామ : మండల కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు వివిధ రకాల ముగ్గులు వేశారు. బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రియాంక, ఎంపీడీవో బాల్‌రెడ్డి, ఎంపీవో గిరిరాజ్, ఎస్ఐ ప్రవీన్‌కుమార్, హెచ్ఎం దినేశ్, ఎన్‌వైకే కన్వీనర్ దాసరి శ్రీశైలంయాదవ్ మహిళలు పాల్గొన్నారు.
నందిగామ : మున్సిపాలిటీ చైర్ పర్సన్ లావణ్యయాదవ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.