కొడంగల్, ఆగస్టు 20 : పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉట్ల ఉత్సవంతో పాటు శ్రావణమాసం నాలుగో శనివారం సందర్భంగా విశేష పూజలు చేశారు. ఆలయంలో స్వామివారికి పాలు, పండ్లతో అభిషేకం చేశారు.
వికారాబాద్, ఆగస్టు 20 : వికారాబాద్ పట్టణంలోని శివరాంనగర్ కాలనీలో శ్రీ వివేకావాణి విద్యాలయం పాఠశాల ఆవరణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రెస్మా రాష్ట్ర కమిటీ సభ్యుడు నాగయ్య హాజరై మాట్లాడారు. చిన్నారులు శ్రీకృష్ణ, గోపికల వేషధారణలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నాగయ్య, కాలనీ పెద్దలు బాదం వెంకటేశం, జమాలుద్దీన్, ఉపాధ్యాయులు చంద్రకళ, ప్రియాంక, తబుస్సుం, ఆఫ్రిన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కులకచర్ల, ఆగస్టు 20 : కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల న్యూరవీంద్రభారతి పాఠశాలలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో కులకచర్ల ఎస్ఐ గిరి, జాట్ అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థులు గోపిక, కృష్ణుల వేషధారణలో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు వెంకటయ్య, వెంకట్రాములు పాల్గొనగా, మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గేట్ వద్ద పంచవటి పాఠశాల ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ నిర్వహించారు.
బొంరాస్‌పేట, ఆగస్టు 20 : మండల పరిధిలోని బొంరాస్‌పేటలో భజన మండలి భక్తులు ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి పూజా కార్యక్రమాలు, భజనలు చేశారు. అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్డుడికి డోలారోహణం నిర్వహించారు. ఉదయం ఉట్లు కొట్టే ఉత్సవం చేపట్టారు. తుంకిమెట్ల గ్రామంలో విద్యాజ్యోతి పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో ర్యాలీ నిర్వహించారు.
పరిగి టౌన్, ఆగస్టు 20 : పరిగి పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను శ్రీ సరస్వతి శిశుమందిరం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణ, గోపిక వేషధారణలో ముస్తాబయ్యారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉట్టికొట్టారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షుడు రాచూరి శ్రీనివాస్‌రెడ్డి, మంగిలాల్చౌదరి, ఆనంద్, హిందూవాహిని జిల్లా అధ్యక్షుడు నర్సింహ, ప్రధానాచార్యులు మల్లేశ్ పాల్గొన్నారు.
తాండూరు రూరల్, ఆగస్టు 20 : శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు అయ్యప్పస్వామి దేవాలయంలో రంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు చేశారు.