రంగారెడ్డి, ఫిబ్రవరి 29(నమస్తే తెలంగాణ) : ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సంబంధించి నోడ ల్ అధికారులు, డీఏవోలతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో నియమావళిని కచ్చితంగా అమలు చేయాలన్నారు. శాసనసభ ఎన్నికల మాదిరిగానే కోడ్ వర్తిస్తుందని.. జిల్లాలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వీఎస్టీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నోడల్ అధికారులు వారికి కేటాయించే పనులను సజావుగా నిర్వహించాలన్నారు. శాసనసభ ఎన్నికల్లో తకువ ఓటింగ్ శాతం నమోదైన ప్రాంతాల్లోని ప్రజలకు స్వీప్ కార్యక్రమాల ద్వారా ఓటు హకు వినియోగంపై అవగాహన కల్పించాలని డీఆర్డీఏ పీడీకి సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో 1500కంటే ఎకువ ఓటర్లు ఉంటే సహాయక పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పీడీ శ్రీలత, సీపీవో సౌమ్య, జిల్లా పరిశ్రమల శాఖ అధికారిణి శ్రీలక్ష్మి, ఎన్నికల విభాగం అధికారి సైదులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, డీఏవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.