చేవెళ్ల టౌన్ : క్షయ వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర క్షయ వ్యాధి విజిట్ అధికారుల బృందం మంగళవారం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలోని క్షయవ్యాధి యూనిట్‌కు వెళ్లి రోగులకు అందిస్తున్న చికిత్సపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. టీబీ యూనిట్లో ఉన్న పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల ప్రభుత్వ దవాఖాన వైద్య అధికారులు డాక్టర్ రాజశేఖర్, మెరా, సీనియర్ ల్యాబ్ టెక్నిషియన్, ఎండీ.షఫీ, ల్యాబ్ టెక్నిషియన్లు దేవేందర్, శ్రీధర్, ఇతర సిబ్బంది ఉన్నారు.