ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకల్లో భాగంగా బుధవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపు మేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డిపాలెంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సిద్ధంకి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 257మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు యువకులు, విద్యార్థులు ముందుకొచ్చి రక్తదానం చేశారు.
ఈ రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి, క్యామ మల్లేష్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, తుర్కయంజాల్ మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చెవుల స్వప్న పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పండ్లు పంపిణీ చేశారు. అలాగే, ఇబ్రహీం పట్నం మండలంలోని దండుమైలారం గ్రామంలో టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు పొన్నాళ్ల జగదీశ్ ఆధ్వర్యంలో గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.