ఇబ్రహీంపట్నంరూరల్ : భారత చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన మరణం యావత్తు భారతావనికి తీరని లోటని సర్పంచ్‌లఫోరం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి అన్నారు. హెలిక్యాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన బిపిన్‌రావత్‌తో పాటు మృతిచెందిన సైనికలకు ఉప్పరిగూడ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావత్ దేశానికి చేసిన సేవలను కొనియాడరు. శత్రుదేశాల వ్యూహాలు అంచనా వేయటంలో ఆయనను మించిన యోదులు లేరన్నారు.
అలాంటి గొప్ప అధికారి మృతిచెందడం జీర్ణించుకోలేని విషయమన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే, ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రావత్‌తో పాటు హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన సైనికుల చిత్రపటాలకు నివాళులర్పించారు.