రేపటి నుంచి రామలింగేశ్వర జాతర

- నాలుగు రోజుల పాటు ఉత్సవాలు
- శ్రీరాముడు స్థాపించిన శివలింగానికి పూజలు
- ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
- పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు
- తాండూరు ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సులు
తాండూరు : వికారాబాద్ జిల్లాలోని పేరుగాంచిన ఏకాంబర రామలింగేశ్వరాలయానికి చారిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ ఆలయం బషీరాబాద్ మండలం నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో చక్కటి శిల్పకళతో త్రేతాయుగంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయం నాలుగు వందల గజాల విస్తీర్ణంలో ఉన్న చతురస్రాకారపు కోనేరు మధ్యలో వెలసింది. త్రేతాయుగంలో రావణబ్రాహ్మణ సంహార అనంతరం కోటి శివలింగాల స్థాపనలో భాగంగా శ్రీరాముడు ఇక్కడి ఆలయంలో శివలింగాన్ని స్థాపించాడని తెలిపే గాథ ప్రాచుర్యంలో ఉంది. బ్రాహ్మణ హత్య పథకం నుంచి విముక్తికి గాను సప్త బుషుల సలహా మేరకు శ్రీరాముడు అతి పవిత్రమైన స్థలంగా ఎంచుకొని ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.

ప్రతి సంవత్సరం శ్రావణమాసం చివరి వారంలో నాలుగు రోజులు ఆదివారం నుంచి బుధవారం వరకు జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరలో భాగంగా మొదటి రోజైన ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ఆలయ సమీపంలోని నీళ్లపల్లి గ్రామం నుంచి దేవాలయం వరకు ఊరేగింపుగా స్వామి పల్లకీ సేవా-గంధాలు, సోమవారం రథోత్సవం, మంగళవారం లంకాదహనం కార్యక్రమాలు, బుధవారం జాతర ఉత్సవ ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో హిందువులు, ముస్లింలు ఇతర మతస్తులు పాల్గొనడం విశేషం.
జాతరకు పోలీస్ బందోబస్తు..
జాతరకు తరలి వచ్చే వేలాది మంది భక్తులకు ఆలయకమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. భక్తులు కొవిడ్ నియమాలు పాటిస్తూ జాతరలో పాల్గొనాలని నిర్వాహకులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ మేనేజర్ రాజశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

