అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబర్ 26 : ఎన్నికల నిబంధనలు ఉన్నందున యాసంగి పంట పెట్టుబడిని రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదును నిరసిస్తూ అబ్దుల్లాపూర్‌మెట్‌లో గురువారం రైతు బంధు సమితి మండల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రైతుల నోట్లో మట్టికొట్టేలా వ్యవరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు. గత 6 సంవత్సరాల క్రితం రైతులు అన్నమో రామచంద్రా అని నానా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.
ముఖ్యమత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత రైతుల కండ్లల్లో ఆనందం చూడాలని సుధీర్ఘంగా ఆలోచించి రైతు బంధు పథకానికి శ్రీకారం చేట్టారని తెలిపారు. గతంలో రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుందని రైతుల నడ్డివిరిచే విధంగా మాట్లాడిన రేవంత్‌రెడ్డి మాటలు ప్రజలు, రైతులు మరిచిపోలేదని గుర్తుచేశారు. ఠాక్రే ఫిర్యాదుపై తెలంగాణ రైతులంతా కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కర్ణాటక రైతులు కొడంగల్‌లో నిరసన తెలియజేయడం సిగ్గు చేటన్నారు.
గతంలో అమలు చేసిన పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ విఠల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిషన్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు చక్రవర్తిగౌడ్, సర్పంచ్ కిరణ్‌కుమార్‌గౌడ్, ఎంపీటీసీ సాయికుమార్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్‌గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రవీందర్, నాయకులు జగదీశ్‌గౌడ్, రాంగోపాల్‌గౌడ్, లింగస్వామిగౌడ్, శ్రీనుగౌడ్, కార్యకర్తలు ఉన్నారు.