షాద్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 3: జ్వరాలు వస్తే భయపడాల్సిన అవసరం లేదని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు ప్రజలకు సూచించారు. షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులతో మా ట్లాడి వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ దవాఖానకు వచ్చే రోగులకు అందిస్తున్న వైద్యసేవల గురించి డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి, దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల స మావేశంలో మాట్లాడారు. ఈ సీజనల్లో జ్వరాలు రావడం సాధారణమని, వచ్చిన ప్రతి జ్వరాన్ని డెంగీ అనుకోవద్దన్నారు.
సుమారు 4-5రోజులకు మించి జ్వరం ఉంటే పరీక్ష చేయించుకోవాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే పరీక్ష చేయించుకోవద్దని సూచించా రు. డెంగీ ప్రమాదకరమైనప్పటికీ 90శాతం డెంగీ కేసులకు వైద్యం అవసరం లేకుండా పారాసెటమాల్ మాత్రలు, ద్రవ పదార్థాలు, ఓఆర్ఎస్ తీసుకోవాలన్నారు. డెంగీ నిర్ధారణకు ఎన్ఎస్-1 ఎలిసా పరీక్ష చేయించుకోవాలని, దీని ద్వారా డెంగీ వచ్చిందా, లేదా అని తెలుస్తుందన్నారు. ప్లేట్లెట్స్ అనేవి ప్రతి జ్వ రంలో తక్కువతుంటాయి.. దానికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్లేట్లెట్స్ డెంగీ జ్వరంతోనే పడిపోతాయనేది త ప్పుడు వాదనన్నారు. 50వేల నుంచి 20వేల లోపు ఉన్నా మందుల ద్వారా చికిత్స పొందవచ్చునన్నారు. 20వేలలోపు ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు రక్తం, ప్లేట్లెట్స్ ఎక్కించడం అనేది రో గిని బట్టి నిర్ణయించడం జరుగుతుందన్నారు.
జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు డెంగీ 210 కేసులు, మలేరియా 3 కేసులు, చికెన్‌గున్యా 13 కేసులు వచ్చాయని వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. అదే విధంగా కలుషిత నీరు తాగడం, వంట లో వాడడం ద్వారా డయేరియా, వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, కలరా, కామెర్లు వస్తాయన్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు నీటిని వేడిచేసి తాగాలన్నారు. ప్రతి రోజూ జిల్లా వ్యాప్తం గా వసతి గృహాలను తనిఖీ చేయడం జరుగుతుందని, వసతిగృహాల్లో శానిటేషన్ ప్రకారం శుభ్రంగా ఉన్నప్పటికీ కూరగాయలు అపరిశుభ్రంగా ఉండడం గమనించడం జరిగిందన్నా రు. కుళ్లిన కూరగాయలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అన్నా రు.
ఇప్పటికే వైద్య సిబ్బంది ఇంటింటికి జ్వరాల సర్వే చేయడం జరుగుతుందన్నారు. డెంగీ లక్షణాలు ఎముకలు, కంటి నొప్పులు ఉంటాయన్నారు. మున్సిపాలిటీలో, గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా అధికారులు చూడడంతోపాటు దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నా రు. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. నీరు ఎక్కువగా నిలిచినచోట ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ దవాఖాన నిర్వాహకులు వ్యాధుల పేరుతో రోగులను భయపెడితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవే ట్ దవాఖానలో వైద్యం అందించే సేవలకు సంబంధించిన ఖర్చులతో కూడిన వివరాల బోర్డులను తప్పకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ శ్రీనివాసులు, డీఎంఎన్హెచ్వో సీసీ సురేశ్, ఎంపీహెచ్వో శ్రావణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.