గురువారం 22 అక్టోబర్ 2020
Rangareddy - Sep 06, 2020 , 00:26:33

పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి

పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి

- గ్రీనరీకి ప్రధాన్యత ఇవ్వండి

- సంద చెరువును సందర్శించిన అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ 

 బడంగ్‌పేట : మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఉన్న సంద చెరువును రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ శనివారం  సందర్శించారు. ప్రశాంత్‌ హిల్స్‌కాలనీ, ఆర్‌సీఐ రోడ్డులో హరితహారంలో నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. నందిహిల్స్‌కాలనీలో గార్డెన్‌ను పరిశీలించారు. రోడ్డు, చెరువు కట్ట వెడల్పు ఎప్పటిలోగా పూర్తిచేస్తారని కమిషనర్‌ను అడిగారు. చెరువు సుందరీకరణ పనుల గురించి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. వైకుంఠదామాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రీనరీ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తదితరులు ఉన్నారు. logo