కడ్తాల్, డిసెంబర్ 28 : పుడమిపై ఉన్న సమస్త ప్రాణకోటికి విశ్వ నియమాలు ఒక్కటేనని, సద్గుణాలు కలిగి ఉన్న వారికి భవిష్యత్తు బాగుంటుందని పీఏఎస్ఎస్ఎం చైర్మన్ పరిమళ పత్రీ అన్నా రు. మండల కేంద్రం సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌లో, ది పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగాలు గురువారం ఎనిమిదో రోజుకు చేరుకున్నా యి.
ఉదయం 5 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన, ప్రాతఃకాల ధ్యానంలో పరిమళ పత్రీ, పరిణీత పత్రీ, వివిధ ప్రాంతాల నుంచి విచ్ఛేసిన ధ్యానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్ధేశించి పరిమళ పత్రీ మాట్లాడుతూ నిత్యం ధ్యాన సాధనతో ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. మనిషి ప్రతి విషయంలో మంచి వెతకాలని, ఎదుటి వారితో ప్రేమానురాగాలతో మెలగాలని పేర్కొన్నారు. ఆధ్మాత్మికతోనే ప్రతి ఒక్కరికి సరైన మితృత్వం లభిస్తున్నదని తెలిపా రు. పత్రీజీ శక్తిస్థల్‌ను అద్భుతంగా తీర్చిదిద్ధుకోవాల్సిన బాధ్యత ప్రతి ధ్యానిపైన ఉన్నదని పేర్కొన్నారు.
పరిణితీ పత్రీ మాట్లాడుతూ.. నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఫియరెన్స్ అనే సూత్రాలతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని తెలిపారు. జంతు వధశాలలు మూతపడితేనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. ఊహా శక్తికి ధ్యానం తోడైతే సాధించలేనిది ఏమిలేదని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ ప్రవచనకర్త నండూరి శ్రీనివాసరావు ప్రవచనలు, కళాకారుల నృత్య ప్రదర్శనలు, పిరమిడ్ మాస్టర్ల ప్రసంగాలు ధ్యానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సభ్యు లు బాలకృష్ణ, హన్మంతురాజు, సాంబశివరావు, రాంబాబు, శివప్రసాద్, దామోదర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, మాధవి, జయలక్ష్మి, ధ్యానులు తదితరులు పాల్గొన్నారు.