వంట గ్యాస్ సబ్సిడీ అందకపోవడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో 13,39, 850 మంది గ్యాస్ వినియోగదారులు ఉండగా.. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా తెల్లరేషన్ కార్డు కలిగిన 2,08,200 మందిని మహాలక్ష్మి పథకానికి అర్హులుగా అధికారులు ఎంపిక చేశారు. వీరికి గ్యాస్ సిలిండర్‌పై రావాల్సిన సబ్సిడీ డబ్బుల కోసం బ్యాంకుల కోసం తిరుగుతున్నారు.
రంగారెడ్డి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ సర్కార్ అందులో భాగమైన మహాలక్ష్మి పథకానికి ఆరంభంలోనే తూట్లు పొడిచింది. ఈ ప థకం కింద సబ్సిడీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వకపోవటంతో లబ్ధిదారులు అసహ నం వ్యక్తం చేస్తున్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల ముందు విస్తృతంగా ప్రచారం చేశారు. వారి మాటలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేశారు. పవర్లోకి వచ్చిన తర్వాత సర్కార్ అర్హుల జాబితాను విడుదల చేయగా.. జిల్లాలో సుమారు రెండు లక్షలకు పైగా లబ్ధిదారులున్నారు. వారందరూ గ్యాస్ సిలిండర్ పై రావాల్సిన సబ్సిడీ డబ్బు ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.
జిల్లాలో 13,39,850 మంది గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. అందులో ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా తెల్లరేషన్ కార్డు కలిగిన 2,08, 200 మందిని మహాలక్ష్మి పథకానికి అర్హులుగా అధికారులు ఎంపిక చేశారు. వీరందరికీ మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సబ్సిడీ రావాల్సి ఉన్నది. ఇందుకోసం వారు మండల పరిషత్ కార్యాలయా లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వంటగ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీ రూ. 40.71 పోను మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కానీ, ఆ సబ్సిడీ మాత్రం మహిళల ఖాతాల్లో జమ కావడంలేదు.
ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీ ఇవ్వకపోవటంతో పేద, మధ్యతరగతి మహిళలు మళ్లీ కట్టెలపొయ్యిల వైపే మొగ్గుచూపుతున్నారు. ప్రభు త్వం సబ్సిడీ చెల్లించకపో వడంతో చాలామంది మహిళలు గ్యాస్ కొనటాన్ని మానేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు వంటగ్యాస్‌ను సబ్సిడీపై అందిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. పవర్లోకి రాగానే లబ్ధిదారులకు చెల్లించకపోవడం దారుణం. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలందరూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు కావడంలేదు.
-పవిత్ర, ఇబ్రహీంపట్నం
వంట గ్యాస్‌ను సబ్సిడీ కింద ఇస్తామన్న రేవంత్ సర్కార్ ఇప్పటికీ ఇవ్వడంలేదు. ఎన్నికలకు అలవికాని హామీలిచ్చి.. అధికారంలోకి రాగానే వాటికి మంగళం పడుతున్నది. ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు కావడంలేదు.
-బొమ్మరాజు జయమ్మ, మీర్ఖాన్పేట్