వికారాబాద్ : ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులెవరు ఆర్థికంగా నష్టపోరని హామీ ఇస్తున్నట్లు బ్యాంక్ అధికార ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ శాఖలో కొన్ని అక్రమాలను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించి బాధ్యులపై అత్యంత కఠినమైన క్రమ శిక్షణ చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు.
పోలీస్ విచారణకు మేము పూర్తిస్థాయిలో సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంపై ఖాతాదారులకు ఎలాంటి నష్టం జరుగలేదని, ఎవరూ కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు.