వికారాబాద్, సెప్టెంబర్ 17 : ‘మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు.. జర చూడండి సారూ..’ అంటూ డాక్టర్లను వేడుకున్నా కనికరించలేదని ఓ కూతురు ఆవేదన వ్యక్తం చేసింది. ధారూరు మండలం కెరెళ్లి గ్రామానికి చెందిన బుడ్డ వెంకటమ్మ ఆరోగ్యం బాగాలేదని కూతురు చికిత్స కోసం మంగళవారం రాత్రి వికారాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చారు. రాత్రి సమయంలో వైద్యులు వెంకటమ్మకు రెండు గ్లూకోజ్లు ఎక్కించారు.
బుధవారం ఉదయం వెంకటమ్మను ఇంటికి తీసుకెళ్లాలని బలవంతంగా ఆసుపత్రివారు బయటకు పంపించారు. నడవలేని స్థితిలో ఉన్న తల్లి దవాఖాన ఆరుబయటనే పడుకున్నది. డాక్టర్లు పట్టించుకోవాలని పలుమార్లు వేడుకున్నా కనికరించలేదని కూతురు మనోవేదనకు గురైంది. ఆరుబయట తల్లి దీన స్థితిని చూసి తట్టుకోలేక కూతురు కంటతడి పెట్టింది. చికిత్స కోసం వచ్చిన రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది కనికరించనితీరు చర్చనీయాంశంగా మారింది.