తుర్కయంజాల్, సెప్టెంబర్ 24: దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంజాపూర్ గ్రామం దుర్గానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు బుధవారం అమ్మవారు అన్నపూర్ణ దేవీ అవతారంలో దర్శనమిచ్చారు. అనంతరం మండపం వద్ద మహిళలు ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. కార్యక్రమంలో బొక్క వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కృష్ణ రెడ్డి, నాగ భూషణ్, శేఖర్ రెడ్డి, చంద్రశేఖర్, కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.