చేవెళ్ల రూరల్, ఫిబ్రవరి 19 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుండటంతో తద్వారా గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. అందుకు నిదర్శనంగా నాంచేరు (అనుబంధ గ్రామాలు కిష్టాపూర్, ఇంద్రారెడ్డినగర్) గ్రామం నిలుస్తున్నది. నాంచేరు (అనుబంధ గ్రామాలు కిష్టాపూర్, ఇంద్రారెడ్డినగర్) సర్పంచ్ కొత్తపల్లి సక్కుబాయి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకుమార్ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారు.
ఏండ్ల నాటి సమస్యలకు పరిష్కారం..
పల్లె ప్రగతి పనులతో గతంలో పేరుకుపోయిన సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రత్యేక శ్రద్ధతో గ్రామంలో సమస్యలు లేకుండా ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నారు.
పల్లె ప్రగతి పనులు పూర్తి
వైకుంఠధామం, నర్సరీ, పల్లె ప్రకృతివనం, డంపింగ్‌యార్డు, సీసీ రోడ్లు, వీధిలైట్లు, పలు అభివృద్ధి పనులు గ్రామంలో పూర్తి చేసి ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పారిశుధ్య పనులు, మొక్కల సంరక్షణ, చెత్తను డంపింగ్ యార్డుకు తరలించి తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు.
ఏపుగా పెరిగిన మొక్కలు..
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో, పల్లె ప్రకృతి వనం, ప్రధాన రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
గ్రామస్తుల సహకారంతోనే సాధ్యం..
గ్రామస్తుల సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమైంది. పల్లె ప్రగతి పనులతో ఏళ్ల నాటి పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం దొరికింది. పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చుతున్నాం.
– శివకుమార్, పంచాయతీ సెక్రటరీ, నాంచేరు
సమస్యలు పరిష్కారం..
పల్లె ప్రగతి పనులతో గతంలోని సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యాయి. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి అధిక నిధులు మంజూరు చేస్తున్నారు. గతంలో లేని విధంగా ప్రజలకు సౌకర్యాలు కల్పించి వారి వెతలు తీర్చుతున్నాం.
– కొత్తపల్లి సక్కుబాయి, నాంచేరు సర్పంచ్