మొయినాబాద్, జనవరి 9 : యువతి హత్య కేసు దర్యాప్తును మొయినాబా ద్ పోలీసులు ముమ్మరం చేశారు. నిం దితులను పట్టుకునేందుకు విభిన్న కోణాల్లో పరిశీలిస్తున్నారు. మృతదేహం వద్ద లభించిన సెల్‌ఫోన్ డాటా కేసు దర్యాప్తులో కీలకం కానున్నది. సోమవారం మధ్యాహ్నం బాకారం సమీపంలోని రోడ్డుపక్కన ఓ యువతి మృతదేహంపై పెట్రోలు పోసి గుర్తుతెలియని దుండగులు తగులబెట్టిన విష యం తెలిసిందే. మృతదేహం వద్ద లభించిన సెల్‌ఫోన్‌ను పోలీసులు ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అందులోని సమాచారం తెలిస్తే కేసు లో కొంత పురోగతి సాధించొచ్చనే ఆలోచనలో పోలీసులున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో 25 ఏండ్లలోపు ఉన్న వారి మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదయ్యాయా అని మొయినాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఎక్క డా హత్యకు గురైన యువతి వయసు ట్యాలీ కావడంలేదని సమాచారం. దుండగుల్లో ఎవరైనా మొయినాబాద్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారా..? లేదా దుండగులకు ఈ ప్రాంతం తెలు సా..? అనే కోణంలోనూ విచారిస్తున్నా రు. మంగళవారం చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్యకు గురైన యువతి మృతదేహం తగులబెట్టిన సమయంలో వాహనదారులు ఎవరైనా చూశారా అనే కోణంలో దర్యాప్తు చేశారు. చుట్టుపక్కల పొలాలున్న రైతులు, దారి వెంబడి వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసే వారిని కూడా ఆరా తీశారు.