ఇబ్రహీంపట్నంరూరల్, మే 3 : ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు అనుబంధ గ్రామం మేటిళ్లలో అనుమతులు లేకుండా ప్రైవేటు వెంచర్‌కు రోడ్డు వేసిన ఆర్అండ్బీ అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్‌పై ఉన్నతస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం మండల పరిషత్ అధ్యక్షుడు కృపేష్ అన్నారు. సోమవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. వివిధ అంశాలపై సమావేశంచలో చర్చించారు. గ్రామీణ ప్రాంతాలకు ప్రజలకు సరిపడా తాగునీరు సరఫరా చేయాలని కోరారు.
ముఖ్యంగా గ్రామాల్లో తాగునీరు సక్రమంగా అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిపై తమ పచ్చని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, దీనిపై ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని ఎంపీపీ కోరారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్ సీఐ సీతారాంరెడ్డి మాట్లాడుతూ..మత్తు పదార్థాల నిర్మూళనకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ మంచిరెడ్డి వెంకటప్రతాప్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు భరత్‌రెడ్డి, ఎంపీటీసీలు శ్రీశైలం, ఆంజనేయులు, అరుణమ్మ, అనసూయ, మంగ, ఎంపీడీఓ క్రాంతికిరణ్, సీడీపీవో శాంతిశ్రీ, ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
మొయినాబాద్ : ప్రతి మూడు నెలలకు ఒక్కసారి నిర్వహించే మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా వేశారు. ఈ నెల 3వ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించాలని వారం రోజులుగా కసరత్తు చేసి ఎజెండాను తయారు చేశారు. మండలంలో ఎంపీపీతో కలిసి 17 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా.. ఎంపీపీ నక్షత్రం, వైస్ ఎంపీపీ మమత, రెడ్డిపల్లి ఎంపీటీసీ శ్రీనివాస్, శ్రీరాంనగర్ ఎంపీటీసీ రాంరెడ్డి మాత్రమే హాజరయ్యారు.
సమావేశం నిర్వహించడానికి సభ్యుల రాక కోసం 12 గంటల వరకు ఎంపీపీ , అధికారులు వేచి ఉన్నారు. ఎంపీటీసీ సభ్యులు రాకపోవడంతో కోరం లేదని సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ నక్షత్రం ప్రకటించారు. సమావేశానికి ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఏవో రాగమ్మ, హెచ్‌వో అశోక్, సూపరిటెండెంట్ సులోచన, ఏఈలు హము, రాజేశ్‌బాబు, సోషల్ వెల్ఫేర్ అధికారి జోత్స్న, హెల్త్ సూపర్వైజర్ ఉమామహేశ్వర్ తదితరులు హాజరయ్యారు.