పరిగి, జూన్ 10: పరిగి (Parigi) మండలం రాపోలు గ్రామంలో రాత్రి తల్లీకొడుకుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో గండు నర్సమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. నర్సమ్మ కుమారుడు రాజేందర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని పరిగి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వృద్ధురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.