యువత ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసలుగా మారి చేతిలో ఉన్న డబ్బంతా ఆ ఆటలకే ఖర్చుచేయడంతోపాటు.. ఇతరుల వద్ద డబ్బులు తీసుకుని అప్పుల పాలవుతున్నారు. వాటిని తీర్చే మార్గం లేక కొందరు బలవన్మరణాలకు పాల్పడుతుండగా.. మరికొందరు చోరీలు, హత్యలు కూడా చేస్తూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
-రంగారెడ్డి, డిసెంబర్ 19 (నమస్తేతెలంగాణ)
ఆడే గేములు ఇవే..
ముఖ్యంగా యువత క్రికెట్, పేకాట, హార్స్‌రైడింగ్, రూ లెట్, లూడో, ఆన్లైన్ జూదంతోపాటు క్యాసినో కేం ద్రాల్లో ఉన్న అనేక రకాల ఆటలపై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్‌లు నిర్వహించేవారు. ముందుగా కొంత లాభాన్ని చూపించి యువతను ఆకర్షిస్తున్నారు. ఆ తర్వాత వారి నుంచి సర్వం లాగేస్తున్నారు. అదేవిధంగా యువత ఎక్కువగా లోన్ యాప్‌లు, మైక్రో ఫైనా న్స్ సంస్థల నుంచి అప్పులు తీసుకుంటున్నారు. రుణాలు చెల్లించాలని వారు వేధించడం, బెదిరిస్తుండడం, చెల్లించలేని స్థితిలో ఉన్న వారు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 20 నుంచి 25 మంది వరకు ఆత్మహత్యలు చేసుకోగా.. అనేకమంది చోరీ కేసుల్లో ఇరికి సతమతమవుతున్నారు.
యువత ఆ వ్యసనానికి దూరంగా ఉండాలి
ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఆన్లైన్ బెట్టింగ్‌ల ఊబిలో పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఆ వ్యసనానికి దూరంగా ఉండాలి. ఎంతోమంది అప్పులు చేసి ఆన్లైన్ గేములాంటి ప్రాణాలు తీసుకోవడం తోపాటు నేరాలకు పాల్పడుతున్నారు. త్వరలోనే యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తాం.
-కేపీవీ రాజు, ఇబ్రహీంపట్నం ఏసీపీ