షాద్‌నగర్‌రూరల్, అక్టోబర్ 28 : ప్రతి పక్షాలు గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదని తెలిసి ప్రజలను మోసగించేలా ప్రతిపక్షాలు నీటిమీద బుడగలాంటి హామీలు ఇస్తున్నారని, వారి మోసపూరిత మాటలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఫరూఖ్‌నగర్ మండలంలోని మేళ్లగూడ, వెంకన్నగూడ, కొండన్నగూడ, బుచ్చిగూడ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
60 ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక తొమ్మిదిన్నర సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కండ్ల ముందు కన్పిస్తుందని అన్నారు. మరింత అభివృద్ధిని సాధించడానికి ఎమ్మెల్యేగా మళ్లీ తనను గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కోట్లాది రూపాయాలతో చేసిన అభివృద్ధి పనులను గడపగడపకూ వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు.
ఉమ్మడిపాలన నాయకులు తండాలు, గ్రామాలను కేవలం ఓటు బ్యాంకుగా వినియోగించుకున్నారని, స్వరాష్ట్రంలో తండాలు, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంతో నేడు పట్టణాలను తలపిస్తున్నాయని అన్నారు. 500 జనాభా దాటిన ప్రతి తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా మార్చడంతో పాటు వాటి అభివృద్ధ్దికి ప్రత్యేక నిధులు ఇవ్వడంతో వాటి దశ మారిందన్నారు.
మండలంలోని ఏ గ్రామం, తండాకు వెళ్లినా అక్కడ అంజన్న వెంటే మేమంతా అంటూ ఇండ్లకు తాళం వేసి ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ వెంట ప్రజలు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అంజన్న వచ్చాకే తమ గ్రామాలు, తండాలు ఎంతో అభివృద్ధిని సాధించాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొంటున్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ గణేశ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు లక్ష్మణ్‌నాయక్, లక్ష్మణ్, శ్రీనివాస్‌యాదవ్, మండలాధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు వంకాయల నారాయణరెడ్డి, బెంది శ్రీనివాస్‌రెడ్డి, రాయికల్ వెంకట్‌రెడ్డి, రాంబల్‌నాయక్, హన్యానాయక్, చందు, కిషన్‌నగర్ ఎంపీటీసీ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్ ఓటర్లను అభ్యర్థించారు. షాద్‌నగర్ పట్టణంలోని 16వ వార్డులో కౌన్సిలర్లు, నాయకులతో కలిసి శనివారం జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. ప్రజల శ్రేయస్సుకు, రాష్ర్టాభివృద్ధికి ఎంతో ముందుచూపు ఆలోచనతో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ర్టాభివృద్ధి ఎవరూ చేశారో ప్రజలకు తెలుసని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలే తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ మరింత అభివృద్ధిని సాధించాలంటే ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
షాద్‌నగర్ మున్సిపాలిటీలోని వార్డుల్లో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకుల ప్రచారం జోరుగా సాగుతున్నది. గడపగడపకూ వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డుల్లో కదిలిన గులాబీదండుతో వార్డులు గులాబీమయంగా మారాయి. కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, జీ.టీ శ్రీనివాస్, కో-ఆప్షన్ సభ్యులు ఒగ్గు కిశోర్, పద్మాస్టీఫెన్, నాయకులు యుగేందర్, పాండురంగారెడ్డి, నందకిశోర్, సుధాకర్, సలీం, చెన్నయ్య, పాపయ్య, శేఖర్, శ్రీనివాస్ రఘు, రాఘవేందర్‌రెడ్డి, శేఖర్, చంద్రశేఖర్, పిన్నమోని గోపాల్, భాస్కర్, మహేశ్, శివ పాల్గొన్నారు.
కొత్తూరు : వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని గూడూరులో సర్పంచ్ బ్యాగరి సత్తయ్య ఆధ్వర్యంలో కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు గుండు సురేశ్, జగన్ మల్లేశ్, అశోక్, వెంకటేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
నందిగామ : ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ మండలంలోని చేగూరు, బండోనిగూడతండా, మోత్కులగూడ గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, ప్రలోభాలకు గురిచేసినా ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జట్ట కుమార్, ఎల్లమ్మ, చేగూరు పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, నాయకులు శ్రవణ్, రవి, ఆంజనేయులు, రమేశ్, రవీందర్ పాల్గొన్నారు.