షాద్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 11: గణేశ్ నిమజ్జనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని బొబ్బిలి చెరువును బుధవారం ఏసీపీ రంగస్వామి, సీఐ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, మాజీ చైర్మన్ విశ్వం, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు సకల సదుపాయాలను కల్పించాలన్నారు.
ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు భక్తులకు అందుబాటులో ఉండాలన్నారు. అదే విధంగా ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చెరువు వద్ద భద్రత చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సర్వర్‌పాషా, శ్రీనివాస్, నాయకులు చెన్నయ్య, బాబర్‌ఖాన్, ప్రకాశ్, బస్వం, శ్రీకాంత్‌రెడ్డి, బాల్‌రాజు, విజయ్‌కుమార్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అలీఖాన్, ఖదీర్, అశోక్ పాల్గొన్నారు.
మున్సిపాలిటీలోని బొబ్బిలి, పెరుమాళ్ల చెరువు వద్ద నిమజ్జనానికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలోని బొబ్బిలిచెరువు వద్ద ఏర్పాట్లను బుధవారం మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, కమిషనర్ వెంకన్న, కౌన్సిలర్ బచ్చలి నర్సింహ, నాయకులు నర్సింహ, శేఖర్, శ్రీశైలం, రవి, అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువుల వద్ద క్రేన్లను, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. భక్తులు తగిన జాగ్రత్తలను పాటిస్తూ చెరువుల వద్ద ఉన్న అధికారులకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
షాద్‌నగర్‌టౌన్ : గణేశ్ ఉత్సవాలతో షాద్‌నగర్ మున్సిపాలిటీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అన్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని 22వ వార్డులో వార్డు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, నాయకులు రవియాదవ్, రఘునాథ్‌యాదవ్, యూత్ సభ్యులతో కలిసి బుధవారం పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు, యూత్ సభ్యులు జంగరాజు, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.