షాద్‌నగర్, ఫిబ్రవరి4: నేటి పోటీ ప్రపంచంలో గ్రామీణ ప్రాంత క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్రీడాకారులను కోరారు. ఆదివారం చౌదరిగూడ మండల కేంద్రంలో నిర్వహించిన క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.
ప్రస్తుత అన్ని రకాల క్రీడల్లో గ్రామీణ ప్రాంత క్రీడాకారులదే ఉత్తమ ప్రతిభ చూపుతున్నారని, క్రికెట్‌తో పాటు వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెట్స్ , బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో రాణించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు యాదయ్య, వేణుగోపాల్, గిరిధర్, రాజు, సత్యనారాయణ, అన్వర్, ప్రవీణ్, చంద్రబాబు, క్రీడాకారులు పాల్గొన్నారు.